E-Paper
Advertisement

దిగివచ్చిన మోడీ? నీట్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన, విద్యార్థులు శాంతిస్తారా?

దిగివచ్చిన మోడీ? నీట్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన, విద్యార్థులు శాంతిస్తారా?
Advertisement

PM Modi: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ అక్రమాలకు పాల్పడేవారికి వేగంగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము చేపడుతున్న వరుస చర్యలలో మరొకటి రాసుకొచ్చారు.

ఢిల్లీలో యువత ఆందోళనలు తీవ్రతరం-పేపర్ లీక్ వ్యవహారంపై రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ యువతకు ఒక సందేశాన్ని పంపారు.మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు.

Advertisement

ప్రధాని మోదీ ప్రకటన-పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. పత్రాల లీకేజీలో పాలు పంచుకున్న నిందితులకు త్వరితగతిన కఠినమైన శిక్ష పడేలా చూసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు- పత్రాల లీకేజీలో ప్రమేయం ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక భాగమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము తీసుకుంటున్న చర్యల్లో ఇది కొనసాగింపుగా రాసుకొచ్చారు. యువత భవిష్యత్తుకు హాని తలపెట్టేవారిని వదిలిపెట్టబోమమని  హామీ ఇచ్చారు.

Advertisement

ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ –పేపర్ లీక్ వ్యవహారంపై బొద్దింక జనతా పార్టీ- సీజేపీ, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లులో 150కి పైగా పేపర్ లీక్‌లు జరిగాయని, ఈ కేసుల్లో నిందితులకు శిక్ష పడలేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటన చేశారు.

ALSO READ: ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..

మంగళవారం ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి పేపర్ లీక్స్ అంశంపై ప్రధాని నోరు విప్పారు. దీన్ని ఘోర పాపంగా అభివర్ణించారు. పేపర్ లీక్‌ల వ్యవహారం గురించి పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో కేంద్రం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆందోళనకారులతో తొలుత పలువురు కేంద్రమంత్రులు మాట్లాడారు.

విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని వాంగ్ చుక్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత  రాత్రి మరో మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. అయినా ఆందోళనకారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పరిస్థితి గమనించిన ప్రధాని  మోదీ,  గురువారం ఉదయం ఎక్స్ వేదికగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంశాన్ని ప్రస్తావించారు. సీజేపీతోపాటు ప్రతిపక్ష పార్టీలు మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×