November 2026 Bike Launches: ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో నవంబర్ 2026లో పలు కొత్త బైక్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్, BMW, డుకాటి, ట్రయంఫ్, సుజుకి, యమహా, హోండా లాంటి పలు కంపెనీల నుంచి కొత్త మోడళ్లు, అప్‌డేటెడ్ బైక్‌లు అడుగుపెట్టబోతున్నాయి. అడ్వెంచర్ బైక్‌ల నుంచి స్పోర్ట్స్ నేకెడ్ మోడళ్లు, క్రూయిజర్ల వరకు పలు సెగ్మెంట్లలో కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ బైక్‌ల ధరలు, ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హిమాలయన్ 750 అడ్వెంచర్ టూరర్ రానుంది. కొత్త 750cc ప్లాట్‌ఫామ్‌పై రూపొందే ఈ బైక్ దూర ప్రయాణాలు, అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది. దీని అంచనా ధర రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఉండొచ్చు. నవంబర్ 30 విడుదల కానుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 750 కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇందులో కొత్త 750cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉండవచ్చని అంచనా. కేఫ్ రేసర్ డిజైన్‌ను ఇష్టపడేవారికి మంచి ఆప్షన్ కానుంది. దీని అంచనా ధర రూ.3.80 లక్షల నుంచి రూ.3.90 లక్షల వరకు ఉండొచ్చు.
BMW మోటోరాడ్ నుంచి F 450 R నేకెడ్ రోడ్‌స్టర్ వచ్చే అవకాశం ఉంది. మిడ్ కెపాసిటీ పనితీరు బైక్‌ల విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ మోడల్ ధర సుమారు రూ.4.60 లక్షలుగా ఉండవచ్చని అంచనా.
అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో డుకాటి డెసర్ట్‌ఎక్స్ V2పై అంచనాలు ఉన్నాయి. నవంబర్ 15న విడుదల కావచ్చని, ధర రూ.19 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం.
ట్రయంఫ్ నుంచి అప్‌డేటెడ్ స్ట్రీట్ ట్రిపుల్ 798 మోడల్ రానుంది. దీని ధర రూ.11.25 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్య ఉండొచ్చు. నవంబర్ 17ను విడుదలయ్యే అవకాశం ఉంది.
సుజుకి GSX-S1000 ఇన్‌లైన్ ఫోర్ ఇంజన్‌తో కూడిన పనితీరు ఆధారిత నేకెడ్ బైక్. దీని అంచనా ధర రూ.12 లక్షలు. నవంబర్ 3న విడుదల కావచ్చని తెలుస్తోంది.
BMW R 1300 Rలో పెద్ద బాక్సర్ ఇంజన్ ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ రోడ్‌స్టర్ ధర రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. నవంబర్ 30న విడుదల కావచ్చని సమాచారం.
రోజువారీ ప్రయాణాలకు అనువైన యమహా FZ-15 ABS అప్‌డేటెడ్ మోడల్‌గా రావచ్చని అంచనా. దీని ధర సుమారు రూ.1.27 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ABS ఫీచర్ తో భద్రతపై మరింత ఫోకస్ పెట్టిన మోడల్‌గా నిలవొచ్చు.
హోండా రెబెల్ 500 ప్యారలల్ ట్విన్ ఇంజన్ తో వచ్చే క్రూయిజర్ బైక్. నవంబర్ మధ్య నుంచి చివరి వరకు డీలర్‌షిప్‌లకు చేరుకోవచ్చని అంచనా. దీని ధర రూ.5.40 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉండనుంది.
Read Also: నింజా 300 ఆధారంగా కొత్త బైక్.. కవాసకి Z300 ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!