E-Paper
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ
Advertisement

SSC Junior Engineer Jobs ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుంచి కీలకమైన అవకాశం వచ్చింది. SSC జూనియర్ ఇంజినీర్ పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1,748 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
జూనియర్ ఇంజనీర్ పోస్టులతో పాటు ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ

SSC JE 2026 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 22, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అంటే దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 22. అయితే ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు సెప్టెంబర్ 23 రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సవరణలు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ (అంచనా)

Advertisement

SSC JE పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించనున్నారు. పేపర్ 1ను అక్టోబర్ లేదా నవంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది. పేపర్ 2ను డిసెంబర్ 2026లో నిర్వహించాలని కమిషన్ తాత్కాలికంగా నిర్ణయించింది.

జూనియర్ ఇంజనీర్‌తో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు

ఈ రిక్రూట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు గ్రూప్ బీ కేటగిరీకి చెందినవి.

కొన్ని పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకోవచ్చు

Advertisement

జూనియర్ ఇంజనీర్ మెకానికల్‌కు దరఖాస్తు చేసేవారు జెఇ ఎలిక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్టుకు కూడా అర్హులు.
అయితే సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. జెఇ టెలికామ్ అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్, జెఇ ఎలిక్ట్రికల్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధిత విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలి.
జెఇ ఎలిక్ట్రికల్ అభ్యర్థులు జెఇ టెలికామ్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉంటే జెఇ ఎలిక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు జెఇ టెలికామ్ పోస్టుకు కూడా దరఖాస్తు చేయవచ్చు.

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు.. ఆగస్టు 1, 2026 నాటికి లెక్కిస్తారు. 30 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉన్న పోస్టులకు జనన తేదీ ఆగస్టు 2, 1996 నుంచి ఉండాలి. అలాంటి అభ్యర్థుల జనన తేదీ ఆగస్టు 1, 2008 తర్వాత ఉండకూడదు. 32 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉన్న పోస్టులకు జనన తేదీ ఆగస్టు 2, 1994 నుంచి ఉండాలి. ఇక్కడ కూడా జనన తేదీ ఆగస్టు 1, 2008 తర్వాత ఉండకూడదు.
రిజర్వ్‌డ్ కేటగిరీలకు వర్తించే వయో సడలింపులను అధికారిక నోటిఫికేషన్‌లో చూడాలి.

జీతభత్యాలు (అంచనా)

SSC జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుకు 7వ పే కమిషన్ లెవల్ 6 ప్రకారం నెలకు రూ.35,400 బేసిక్ పే లభిస్తుంది. పే స్కేల్ రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. పోస్టింగ్, డిడక్షన్లను బట్టి ఇన్‌హ్యాండ్ జీతం సుమారు రూ.45,000 నుంచి రూ.62,000 వరకు ఉంటుంది. వార్షిక వేతనం సాధారణంగా రూ.5 నుంచి రూ.8.4 లక్షల వరకు ఉండవచ్చు. ఉద్యోగులకు HRA, DA, TA వంటి అదనపు అలవెన్సులు కూడా లభిస్తాయి. నగరాన్ని బట్టి HRA మారుతుంది. DA కేంద్ర ప్రభుత్వ సవరణల ప్రకారం మారుతుంది.

Also Read: క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

దరఖాస్తు ముందు విద్యార్హతలను తప్పక పరిశీలించండి

ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అందుకే దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. పరీక్ష విధానం, సిలబస్, వయోపరిమితి, విద్యార్హతలను అభ్యర్థులు పరిశీలించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులో సమస్యలు ఎదురైతే 1800 309 3063 నంబర్‌కు సంప్రదించాలి.

Related News

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×