E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు
Advertisement

BBL Teams no interest In Pakistani players: ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ప్లేయర్లకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్లేయర్లపై బిగ్ బ్యాష్‌ లీగ్ ( Big bash league) ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించడం లేదట. వచ్చే సీజన్ లో ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ ను కూడా తీసుకునే ఉద్దేశంలో అక్కడి ఫ్రాంచైజీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్ ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదని…ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అత్యంత దారుణంగా ఓడిపోయారన్న కారణం చూపించి పాకిస్తాన్ ప్లేయర్లను వదిలేసే పనిలో పడ్డాయట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో ఏ జట్టు ఓడిపోనంత ఘోరంగా పాకిస్తాన్ ఓటమిపాలైంది. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కూడా కోల్పోయింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్ లపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. విదేశీ మైదానాలపై పాకిస్తాన్ క్రికెటర్లకు పెద్దగా ఆడడం చేతకాదని పరువు తీస్తున్నారు. పాకిస్తాన్ లో అయితేనే వీళ్లు ఆడతారని చెబుతున్నారు. ఇక ఇమామ్ ఫేక్ గాయం పై కూడా దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

వీటన్నిటిని పరిశీలించిన బిగ్ బాష్ లీగ్ కు సంబంధించిన ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్ నుంచి ఈ పాకిస్తాన్ ప్లేయర్లను ఆడించకూడదని బీబీఎల్ ఫ్రాంచైజీలు డిసైడ్ అయ్యాయట. ఇప్పటికే బీబీఎల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఆడితే, లాభం కంటే న‌ష్ట‌మే జ‌రుగుతోంద‌ని పేర్కొన్నాయ‌ట‌. దీంతో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌పై బ్యాన్ వేసే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

రోడ్డున ప‌డ్డ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..ఇక అడుక్కు తినాల్సిందే!

Advertisement

బిగ్ బాష్‌ లీగ్ లో ( BBL) షాహిన్ అఫ్రిది ( Shaheen afridi) ఆడుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ప్రీమియర్ బౌలర్ గా అతడిని బ్రిస్బేన్ హీట్ టీం తీసుకుంది. బాబర్ ఆజంను ( Babar Azam) సిడ్నీ సిక్సర్స్ జట్టు భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అలాగే మహమ్మద్ రిజ్వాన్ ను కూడా మెల్బోర్న్ రెనెగేడ్స్ కొనుగోలు చేసింది. హరీస్ ర‌వూఫ్‌, షాబాద్ ఖాన్ ( shabad khan), హసన్ అలీ, హసన్ ఖాన్ లాంటి క్రికెటర్లు కూడా బిగ్ బాస్ లీగ్ ఆడుతున్నారు. నిజంగానే బిగ్ బాస్ లీగ్ కు సంబంధించిన ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లపై ఇంట్రెస్ట్ చూపించకపోతే… పైన పేర్కొన్న ఆటగాళ్లు రోడ్డున పడడం గ్యారంటీ అని అంటున్నారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×