E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది
Advertisement

Road Accident Telugu states: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ట్రావెల్ బస్సుకు చెందిన డ్రైవర్ స్పాట్ మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అటు ఆదిలాబాద్‌లో లారీ-సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.

నెల్లూరులో లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు

ఏపీలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా మనుబోలు పోర్టు రోడ్డు సమీపంలోని ఓ వంతెనపై లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు తిరుపతి నుండి విజయవాడ వెళ్తంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జనుజ్జయింది. స్పాట్‌లో డ్రైవర్ మృతి చెందగా, బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను నెల్లూరు జిజిహెచ్‌కి అంబులెన్సులో తరలించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్‌హెచ్ 44 పై రోడ్డు ప్రమాదం

Advertisement

మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారి 44 పై ఎదురెదురుగా వస్తున్న లారీ-సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. నేరేడిగోండ మండలం పరిథిలో కుప్టి బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఎదురెదురుగా వస్తున్న టమాటా లారీ-సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో రోడ్డుకు ఇరువైపులా 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రాకపోకలను నిలిచిపోయాయి.

వాహనాల కదలిక ప్రారంభమైనా వన్ వే కావడంతో నెమ్మదిగా కదులుతున్నాయి. పరిస్థితి గమనించిన అధికారులు ముందుగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని, వాహనాలను పక్కకు తొలగించారు. ఇప్పటికే ఓ వైపు బ్రిడ్జికు డ్యామేజ్ అయ్యింది. దీనికితోడు ప్రమాదం జరగడంతో బ్రిడ్జిపై నుండి వన్ వే లో మాత్రమే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

Advertisement

ALSO READ: మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×