High Voltage Action Thriller: హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమాలంటే ఇష్టమా ? ఇలాంటి మూవీస్ ని పిచ్చిగా ఇష్టపడే సినీ ప్రియులకు ‘బ్లాక్ సైట్’ (Black Site) పర్ఫెక్ట్ మాస్ ట్రీట్ భయ్యా. ఎవరికీ తెలియని అత్యంత రహస్యమైన ఒక సీక్రెట్ జైలు నేపథ్యంలో ఈ కథ కంప్లీట్ ఎంగేజింగ్ గా సాగుతుంది. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను, అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను సాధారణ జైళ్లలో పెట్టకుండా బంధించడానికి ఏర్పాటు చేసిన ఒక హై-సెక్యూరిటీ బ్లాక్ సైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ యాక్షన్ డ్రామా మొత్తం నడుస్తుంది. బయట ప్రపంచానికి సంబంధం లేని ఈ జైలులో ఖైదీలను అదుపులో ఉంచడం, వాళ్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడం అక్కడ పని చేసే అధికారుల బాధ్యత. కానీ ఒక ప్రమాదకరమైన ఖైదీ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. మరి ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? అనే విషయాన్ని తెలుసుకుందాం.
అబ్బీ ట్రెంట్ సీనియర్ సీఐఏ అధికారి. జోర్డాన్ లోని ఎడారి ప్రాంతంలో అత్యంత రహస్యంగా నిర్వహించే సిటాడెల్ అనే బ్లాక్ సైట్ లో ఆమె పని చేస్తుంది. ప్రపంచానికి తెలియకుండా ప్రమాదకరమైన ఖైదీలను అక్కడ నిర్బంధిస్తారు. తన తదుపరి పోస్టింగ్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో అబ్బీకి మరో కీలకమైన బాధ్యత అప్పగిస్తారు. అత్యంత ప్రమాదకరమైన ఖైదీ హ్యాచెట్ ను ఆ జైలుకు తీసుకొస్తారు. శత్రువులను అత్యంత క్రూరంగా చంపే హ్యాచెట్ ను పట్టుకోవడానికి అబ్బీకి వ్యక్తిగత కారణం కూడా ఉంటుంది. గతంలో అతడి కారణంగా తన భర్తను కోల్పోయిన అబ్బీ, అతడి కేసుని చాలా పర్సనల్ గా తీసుకుంటుంది.
అయితే హ్యాచెట్ ను రహస్య జైలులో బంధించామని అధికారులు ఊపిరి పీల్చుకునేలోపే అసలు సమస్య మొదలవుతుంది. అతడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. సహాయం అందడానికి సమయం పట్టే పరిస్థితి ఉండటంతో జైలులోని అధికారులు ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. హ్యాచెట్ ఒక్కొక్కరిని చంపుతూ, దొరికిన వాళ్ళని దొరికినట్టు ఊచకోత కోస్తాడు. అతడిని అడ్డుకోవడానికి అబ్బీతో పాటు అక్కడి సిబ్బంది రంగంలోకి దిగుతారు. కానీ, శత్రువు ఎవరో తెలిసినా అతడిని ఎలా ఆపాలనేదే పెద్ద సవాలుగా మారుతుంది.
అంతేకాదు, జైలులో జరుగుతున్న పరిణామాల వెనుక అధికారుల బృందంలోనే కొందరు వ్యక్తుల హస్తం ఉందనే అనుమానం అబ్బీకి వస్తుంది. బయట నుంచి సహాయం వచ్చేలోపు హ్యాచెట్ ను ఆపాలి. అదే సమయంలో తన టీంలోని నిజమైన శత్రువులను కూడా గుర్తించాలి. మరి ఇంతకీ వాళ్ళని హీరోయిన్ ఎలా పట్టుకుంది ? ఆ ఖైదీని బంధించిందా ? లేదంటే అతడికే బలయ్యిందా ? అన్నది తెలియాలంటే సినిమాను డోంట్ మిస్.
‘బ్లాక్ సైట్’ జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. సినిమా ఒరిజినల్ భాష ఇంగ్లీష్. అయితే తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. మిచెల్ మోనాఘన్ అబ్బీ పాత్రలో కనిపించగా, జై కోర్ట్నీతదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకురాలు సోఫియా బ్యాంక్స్ ఈ చిత్రాన్ని యాక్షన్, సస్పెన్స్ కలగలిపిన థ్రిల్లర్ గా తెరకెక్కించారు. రహస్య జైలు వాతావరణం, ఖైదీ తప్పించుకున్న తర్వాత మొదలయ్యే వేట, నమ్మకద్రోహం చుట్టూ తిరిగే సంఘటనలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రతీ నిమిషం ఉత్కంఠను రేకెత్తించేలా హై-యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగే ఈ మూవీ, వేగంగా కథ ముందుకు వెళ్లే సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది. రక్తాన్ని మరిగించే రివెంజ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం ప్యూర్ మాస్ యాక్షన్ కోరుకునేవాళ్లు ఓసారి చూడొచ్చు.