E-Paper
Advertisement

Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement

Supreme Court: పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. వివాహానికి ముందు శారీరకంగా కలవాల్సిన అవసరమేముందని జస్టిస్ బీవీ నాగర బాధితురాలిని ప్రశ్నించారు. యువతులు కానీ, యువకులు కానీ వివాహానికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదంటూ హితవు పలికారు.

Also Read: Types of Number Plates: రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా.. రకరకాల నెంబర్ ప్లేట్లు.. ఏ రంగు ఎవరికి చిహ్నం!

ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరింపులు 

Advertisement

బహుశా మనం పాతకాలపు వాళ్లమే కావచ్చు. కానీ పెళ్లికి ముందు, ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులు. వారి బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ  వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ఎలా వెళ్లగలుగుతున్నారో అర్థం కావట్లేదు, అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం..  2022లో ఓ మ్యాట్రిమోని ద్వారా ఓ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత అతడికి అప్పటికే రెండు వివాహాలు అయినట్లు  ఆ యువతికి తెలిసింది. కొంతకాలం తర్వాత అతడికి అప్పటికే రెండు వివాహాలు అయినట్లు తెలుసుకున్న యువతి ప్రశ్నించగా ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ నిందితుడు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

Also Read:Brezza 2026 Edition: మరింత కొత్తగా మార్కెట్ లోకి మారుతి సుజుకి బ్రెజ్జా, కీ ఛేంజెస్ ఇవే!

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×