Types of Number Plates: మన రోజూవారి జీవితంలో ఎన్నో రకాల వాహనాలను చూస్తూ ఉంటాం. వివిధ రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లతో అవి ప్రయాణిస్తుంటాయి. కొన్ని తెల్లటి రంగు నెంబర్ ప్లేటుతో ఉంటే మరికొన్ని నలుపు, పసుపు, ఆకుపచ్చ ప్లేట్లను కలిగి ఉంటాయి. అయితే ఆ రంగులకు అర్థం ఏమై ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? వాహనాలకు ఎందుకు వేర్వేరు నెంబర్లు ప్లేట్లు కేటాయిస్తున్నారని సందేహించారా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతుంటే ఈ కథనం ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం.
దేశంలోని మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి నంబర్ ప్లేట్ లేదా వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సంబంధిత రాష్ట్రాల ప్రాంతీయ రవాణా కార్యాలయాలు వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్లను జారీ చేస్తుంటాయి. ఆ వాహనానికి ఉన్న ఉద్దేశాలను బట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు కలర్ బోర్డును సైతం కేటాయిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 8 రంగుల్లో నెంబర్ ప్లేట్లను జారీ చేస్తున్నారు. వాటి వెనుక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
రోడ్లపై మెజారిటీ వాహనాలు తెలుపు రంగు నెంబర్ ప్లేట్లతో దర్శనమిస్తుంటాయి. ఇది అత్యంత సాధారణ రకం నెంబర్ ప్లేటు. సాధారణ పౌరులు వినియోగిస్తుంటారు. ఈ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లు ప్రైవేట్ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
పసుపు రంగు నంబర్ ప్లేట్లు నల్లటి టెక్స్ట్ నమూనాతో వస్తాయి. ఈ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ఎల్లో కలర్ నెంబర్ ప్లేటు వాహనాలను నడపడానికి డ్రైవర్ తప్పనిసరిగా వాణిజ్య డ్రైవింగ్ పర్మిట్ కలిగి ఉండాలి.
మీకు రోడ్లపై ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేటు కనిపించినట్లయితే అవి ఎలక్ట్రిక్ వాహనాలుగా నిర్ధారించుకోండి. ఇవి ప్రైవేటు, వాణిజ్యం అన్న తేడా లేకుండా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు కేటాయించబడతాయి.
ఈ నంబర్ ప్లేటును లగ్జరీ హోటళ్లకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. వీటిని వాణిజ్య రవాణాకు సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ వాహనం నడిపే డ్రైవర్ కు వాణిజ్య డ్రైవింగ్ పర్మిట్ లేకున్నప్పటికీ రోడ్లపై నడిపేందుకు అనుమతి ఉంటుంది.
ఎరుపు రంగు నంబర్ ప్లేట్ కొత్త కారు తాత్కాలిక వాహన రిజిస్ట్రేషన్ కు ఉద్దేశించినది. పర్మినెంట్ నంబర్ వచ్చేవరకూ దీనిని వినియోగించవచ్చు. అయితే 1 నెల మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. తాత్కాలిక వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌లకు సంబంధించిన రంగులు.. ఒక్కో రాష్ట్రాన్ని బట్టి మారుతుండటం గమనార్హం.
విదేశీ దౌత్యవేత్తల కోసం రిజర్వ్ చేయబడిన వాహనాలకు తెలుపు అక్షరాలతో కూడిన నీలం రంగు నెంబర్ ప్లేటును కేటాయిస్తారు. ఈ నంబర్ ప్లేట్‌లలో DC (డిప్లొమాటిక్ కార్ప్స్), CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్) వంటి అక్షరాలు ఉంటాయి. ఈ లైసెన్స్ ప్లేట్‌లలో రాష్ట్ర కోడ్ ఉండదు. వాటి స్థానంలో దౌత్య వేత్త దేశానికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి.
ఈ నెంబర్ ప్లేట్లను సైన్యానికి కేటాయిస్తారు. అందుకే ఆర్మీ వాహనాలు ప్రత్యేక శైలిలో ఉన్న నెంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి. ఆ ప్లేట్లపై కనిపించే సంఖ్యలు రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద నమోదు చేయబడి ఉంటాయి. బాణం తర్వాత వెంటనే వచ్చే రెండు అంకెలు సైనిక వాహనం కొనుగోలు చేయబడిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తరువాత బేస్ కోడ్ వస్తుంది. దాని తర్వాత సీరియల్ నంబర్ ఉంటుంది.
Also Read: Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?
భారతదేశ చిహ్నంతో కూడిన ఎరుపు నంబర్ ప్లేట్లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వంటి ఉన్నత స్థాయి అధికారుల వాహనాలకు కేటాయిస్తారు. ఈ ప్లేట్ ఎరుపు రంగులో ఉన్నందున అక్షరాలు హైలెట్ కావడం కోసం తెలుగు రంగులో రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉంటాయి. అయితే భారత ప్రధాని అధికారిక వాహనం మాత్రం సామాన్యుల తరహాలోనే తెల్లటి రంగు నెంబర్ ప్లేటును కలిగి ఉండటం గమనార్హం.