E-Paper
Advertisement

NIT Campus: కురుక్షేత్ర నిట్‌లో దారుణం.. తెలంగాణ స్టూడెంట్ ఆత్మహత్య, విద్యార్థి పేరెంట్స్ అనుమానాలు

NIT Campus: కురుక్షేత్ర నిట్‌లో దారుణం.. తెలంగాణ స్టూడెంట్ ఆత్మహత్య, విద్యార్థి పేరెంట్స్ అనుమానాలు
Advertisement

NIT Campus: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ‌లో-NIT తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తొలి ఇయర్ చదువుతున్నాడు. శివ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది?

హర్యానాలోని కురుక్షేత్ర నిట్‌లో దారుణం

Advertisement

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 19 ఏళ్ల అంగోత్ శివ కురుక్షేత్రలోని నిట్ చదువుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తొలి ఏడాది స్టూడెంట్.

సోమవారం మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లిన శివ తిరిగి భోజనానికి రాలేదు. దీంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చింది. చివరకు అతడి గదికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలిపింది. వెంటనే విద్యార్థి మృతదేహాన్ని నిట్ నుంచి సివిల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తెలంగాణ స్టూడెంట్ శివ ఆత్మహత్య, పేరెంట్స్ అనుమానాలు

ఈ ఘటనను ఆత్మహత్యగా యాజమాన్యం భావిస్తోంది. శివ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిట్ క్యాంపస్ బయట కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. శివ పేరెంట్స్‌ని ఆసుపత్రి లోపలికి రాకుండా సిబ్బంది అనుమతించలేదు. తమ కుమారుడి మృతి పట్ల కాలేజీ యాజమాన్యం తీరుపై శివ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో శివ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. శివ రూమ్ మేట్స్ ఇద్దరు హర్యానాకు చెందినవారు. ఆ సమయంలో వారిద్దరు భోజనానికి వెళ్లారు. ఉదయం 10 గంటల క్లాసులకు హాజరయ్యాడు శివ.

ALSO READ: దంపతుల ఆత్మహత్య, సూసైడ్ లేఖలో కీలక విషయాలు

రూమ్‌మేట్స్ భోజనానికి వెళ్లగా అతను తన గదికి తిరిగి వచ్చాడని చెబుతున్నారు అధికారులు. గది లోపలి నుండి లాక్ చేశాడని, పదే పదే తలుపులు తట్టినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. చివరకు రూమ్మేట్ భవనం వెనుక వైపుకు వెళ్లి కిటికీ గుండా చూసి సీలింగ్ ఫ్యాన్‌కు శివ వేలాడుతూ కనిపించాడని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×