E-Paper
Advertisement

అసెంబ్లీలో సీఎం విజయ్ ఊహించని ప్రవర్తన.. స్టాలిన్‌ను అనుకరిస్తూ, చేతిని అలా చూపిస్తూ..

అసెంబ్లీలో సీఎం విజయ్ ఊహించని ప్రవర్తన.. స్టాలిన్‌ను అనుకరిస్తూ, చేతిని అలా చూపిస్తూ..
Advertisement

Chennai: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సీఎం విజయ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ పెట్టిన నుంచి రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలకు నోటితోపాటు చేతితో కూడా సమాధానం ఇచ్చారు. అంతేకాదు మాజీ సీఎం స్టాలిక్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

డీఎంకే‌పై సీఎం విజయ్ ఎదురుదాడి

Advertisement

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం సీఎం విజయ్ కీలక ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో హిందీ వివాదం, నీట్‌, కరూర్‌ తొక్కిసలాటకు సంబంధించి విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి అధికారంలోకి వచ్చామన్నారు. నటుడి పార్టీ అంటూ ఎంతోమంది ఎగతాళి చేశారన్నారు.

అధికారం అంత సులువుగా వచ్చింది కాదని ఒక్కముక్కలో తేల్చేశారు. తమిళ ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు కుట్రలు, సవాళ్లను అధిగమించాల్సి వచ్చిందన్నారు. యాక్టర్‌ పార్టీ, షూటింగ్‌ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానని చాలామంది చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు.

Advertisement

 స్టాలిన్‌‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చిన సీఎం విజయ్

కొందరు చేస్తున్న విమర్శలు పట్టించుకోనని, ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు సీఎం. నీట్‌ వివాదం గురించి ప్రస్తావించారు సీఎం విజయ్. నీట్‌ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని తేల్చిచెప్పారు. దీన్ని రద్దు చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ చేశారు.

ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పేశారు. అదే సమయంలో హిందీ భాషను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికీ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టేశారు. కరూర్‌ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తనను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేనన్నారు.

ALSO READ: ప్రపంచవ్యాప్తంగా యోగా డే.. అందర్నీ ఏకం చేసే శక్తి యోగాకు ఉంది, కోల్‌కతాలో ప్రధాని మోదీ

ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని, ఈ విషయంలో మాపై నిందలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో డీఎంకేపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేవలం ఒక కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మా రాజకీయ విధానం కాదని తేల్చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మా సేవలందిస్తామని, అదే మా రాజకీయమన్నారు.

అవినీతిని సహించేది లేదని, ప్రజాధనాన్ని కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తమ పాలన ప్రజల ఆశీస్సులతో జరుగుతోందని, ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని సీఎం విజయ్ ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారం సమయంలో స్టాలిన్ చేసిన  చేతి సైగను అసెంబ్లీలో అనుకరించారు సీఎం విజయ్.  దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

 

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×