E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం
Advertisement

Tanveer Ahmed: ట్రై సిరీస్ లో భాగంగా వైభవ్ సూర్య వంశీ శ్రీలంకపై విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్.. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెటర్లకు నరకం చూపించాడు. మొన్న గొడవ పెట్టుకున్నందుకు తన ఇన్నింగ్స్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్. అతన్ని తిట్టిన వాళ్లతోనే.. ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ఇంత బాగా ఆడుతున్నప్పటికీ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ కారు కూతలు కూయడం మానడం లేదు. అతని బ్యాటింగ్ ను ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు పాకిస్తాన్ మాజీలు. మరోసారి తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) తన అక్కసు వెళ్లగక్కాడు. వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi) ఒక్కసారి ఫామ్ కోల్పోతే.. మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం కష్టమేనని బాంబు పేల్చారు. తనకు బౌలింగ్ ఇస్తే.. వైభవ్ సూర్యవంశీని డక్ ఔట్ చేసి చూపిస్తానని హెచ్చరించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం : తన్వీర్ అహ్మద్

Advertisement

శ్రీలంక లిస్ట్ ఏ జట్టుపై వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)  చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విష ప్రచారం చేస్తున్నారు. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ పై తాజాగా పాకిస్తాన్ లోకల్ ఛానల్ లో స్పెషల్ చర్చ పెట్టారు. ఇందులో తన్వీర్ అహ్మద్ పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ వయస్సు 15 సంవత్సరాలు కాదని… అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా, వాడి వయస్సు 22 సంవత్సరాలు ఉంటుందని బాంబు పేల్చారు. 15 ఏళ్ల కుర్రాడు ఇంత బలంగా బ్యాట్ తో సిక్సర్లు కొట్టలేడని వెల్లడించారు.

అతని బ్యాట్ స్పీడ్ అత్యంత ప్రమాదకంగా ఉందని.. 22 సంవత్సరాలు ఉన్నవాళ్లు మాత్రమే అంతా బలంగా బంతిని కొట్ట గలుగుతారని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. వైభవ్ సూర్య వంశీ వయసు విషయంలో ఐసీసీ పాలక మండలికి లేఖ రాస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంత వేగంగా ఆడుతున్న వైభవ్ ఒక్క సారి ఫామ్ కోల్పోతే, కం బ్యాక్ ఇవ్వడం గగనమేనన్నారు. అయితే వైభవ్ కు కొన్ని అరుదైన బంతులు వేస్తే కచ్చితంగా డక్ అవుట్ అవుతాడని తెలిపారు. ఆఫ్ స్టంప్ న‌కు ఆవ‌ల‌, ఆఫ్ సైడ్ వైపు ఉండే నిర్దిష్ట ప్రాంతంలో బంతులు వేస్తే, వైభవ్ సూర్యవంశీని ( Vaibhav ) ఎర్లీగా ఔట్ చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. దీంతో వైభవ్ సూర్య వంశీ పై తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

 

?igsh=YzM1ZzNmcmJocjA=

Related News

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

శ్రేయ‌స్ అయ్య‌ర్ కు తీవ్ర అన్యాయం..గంభీర్‌, అగార్క‌ర్ క‌లిసి భారీ కుట్ర ?

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆ బుడ్డోడిని ఆడించండి..రోహిత్ తో క‌లిసి చెడుగుడు ఆడుకుంటాడు

దినేష్ కార్తీక్ క‌థ క్లోజ్.. హ‌గ్ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న కోహ్లీ ?

Wasim Akram: వైభ‌వ్ చివ‌రి వ‌ర‌కు ఉంటే..వ‌న్డేల్లో స్కోర్ 1000 దాట‌డం ప‌క్కా

ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

Big Stories

×