E-Paper
Advertisement

ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ బిల్లును ఆదా చేస్తాయా? కొనేముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు!

ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ బిల్లును ఆదా చేస్తాయా? కొనేముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు!
Advertisement

Inverter AC: ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్న వేళ.. ఇళ్లల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఏసీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. వేలల్లో వచ్చే కరెంటు బిల్లును చూసి చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. అయితే వీటికి ఇన్వర్టర్ ఏసీలతో చెక్ పెట్టొచ్చని పెద్ద ఎత్తున కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇవి కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గిస్తాయని జోరుగా ప్రచారం సైతం ఉంది. మరి ఇందులో వాస్తవమెంత? సాధారణ ఏసీలతో పోలిస్తే ఇవి నిజంగానే విద్యుత్‌ను ఆదా చేస్తాయా? కొత్త ఏసీ కొనేముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అసలు ‘ఇన్వర్టర్ ఏసీ’ అంటే?

చాలామంది ఇన్వర్టర్ ఏసీ అంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు హోమ్ ఇన్వర్టర్‌పై నడిచే ఏసీ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇన్వర్టర్ ఏసీ అనేది లోపల ఉండే కంప్రెసర్ మోటార్ వేగాన్ని నియంత్రించే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ (Variable Speed Compressor). ఇది గదిలోని ఉష్ణోగ్రతకు అనుగుణంగా తన వేగాన్ని మార్చుకుంటూ పనిచేస్తుంది.

సాధారణ ఏసీకి, ఇన్వర్టర్ ఏసీకి తేడా

Advertisement

సాధారణ ఏసీ (Non-Inverter AC) ఒకే వేగంతో నడుస్తుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ‘ఆఫ్’ అవుతుంది. మళ్లీ గదిలో వేడి పెరగగానే ‘ఆన్’ అవుతుంది. ఇలా పదే పదే ఆన్, ఆఫ్ కావడం వల్ల కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి ప్రతిసారీ పెద్ద మెుత్తంలో పవర్ ఖర్చు అవుతుంది. అదే ఇన్వర్టర్ ఏసీ అయితే.. గది చల్లబడిన తర్వాత పూర్తిగా ఆఫ్ కాదు. కంప్రెసర్ వేగాన్ని తగ్గించుకుని గది ఉష్ణోగ్రతను ఒకేలా మెయింటైన్ చేస్తుంది. పదే పదే ఆన్-ఆఫ్ కాకపోవడం వల్ల విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది.

కరెంటు బిల్లు నిజంగానే తగ్గుతుందా?

ఇన్వర్టర్ ఏసీల వినియోగంతో ముమ్మాటికి పవర్ బిల్లు తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీలు 30% నుండి 45% వరకు కరెంట్ బిల్లును ఆదా చేయగలవని పేర్కొంటున్నారు. అయితే ఏసీని రోజుకు ఎన్ని గంటలు వాడుతున్నారు అనేదానిపైనే ఈ పవర్ ఆదా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఎవరికి ఇన్వర్టర్ ఏసీ బెస్ట్?

Advertisement

రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ ఆన్ చేసి వారికి ఇన్వర్టర్ ఏసీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అలాగే తక్కువ నాయిస్ కోరుకునేవారు కూడా ఇది మంచి ఛాయిస్. అలాకాకుండా రోజుకు కేవలం ఒకటో రెండో గంటలు మాత్రమే ఏసీ వేస్తామని భావించేవారికి సాధారణ ఏసీ సరిపోతుంది. వారికి ఇన్వర్టర్ ఏసీల వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదని నిపుణులు అంటున్నారు.

Also Read: ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!

డబ్బులు, రిపేర్ పరంగా..

సాధారణ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకటి, రెండేళ్లలో కరెంట్ బిల్లు ఆదాతో అదనంగా పెట్టిన సొమ్మును తిరిగి రికవరీ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇన్వర్టర్ ఏసీ రిపేర్ ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. వీటిలో అధునాతన సర్క్యూట్ బోర్డులు (PCB) ఉండటం వల్ల.. అవి పాడైతే రిపేర్ ఖర్చు సాధారణ ఏసీల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: ఉదయం అలారం మోగుతున్నా ఆఫ్ చేసి పడుకుంటున్నారా? అలారం లేకుండానే లేవడానికి సింపుల్ టిప్స్

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×