E-Paper
Advertisement

ప్రపంచవ్యాప్తంగా యోగా డే.. అందర్నీ ఏకం చేసే శక్తి యోగాకు ఉంది, కోల్‌కతాలో ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా యోగా డే.. అందర్నీ ఏకం చేసే శక్తి యోగాకు ఉంది, కోల్‌కతాలో  ప్రధాని మోదీ
Advertisement

Kolkata: ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి యోగా తీసుకు వచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. యోగాతో ప్రపంచవ్యాప్తంగా ఒకరికొకరు కలిశారని చెప్పారు. యోగా అందర్నీ ఏకం చేస్తుందని, జీవనం మరింత సమతులంగా సాగేలా చేస్తుందన్నారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో యోగా నేర్పుతుందని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా డే 

Advertisement

ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 21న అనగా ఆదివారం యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా డే సందర్భంగా ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ కోల్‌కతాలోని రెడ్‌ రోడ్‌లో 35 వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, యోగాతో ప్రపంచ వ్యాప్తంగా ఒకరినొకరు కలిసినట్లు అయ్యిందన్నారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేశారు.

యోగాతో దేశవ్యాప్తం చైతన్యంతో నిండిపోయిందన్నారు ప్రధాని మోదీ. కేవలం శారీరక వ్యాయామం కాదన్నారు. యోగా కొన్ని వయసుల వారికి పరిమితం కాలేదని, మానవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. యోగా అందర్నీ ఏకం చేస్తుందని, జీవనం సమతులంగా సాగేలా చేస్తుందన్నారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా నేర్పుతోందని, మనల్ని శక్తి, సౌకర్యవంతంగా ఉంచుతుందన్నారు.

Advertisement

కోల్‌కతాలో ప్రధాని మోదీ.. అందర్నీ ఏకం చేసే శక్తి యోగాకు ఉంది

అంతేకాదు వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందని గుర్తు చేశారు. 20 ఏళ్లవారికంటే 40 ఏళ్ల వయసులో మరింత దృఢంగా ఉండాలని, ఒత్తిడి రహిత జీవితానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, కొన్ని సందర్భాలకు పరిమితం చేయకుండా నిత్యం సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయ్నారు. మరింత మెరుగైన ప్రపంచం కోసం యోగా అవసరమని నొక్కివక్కానించారు.

యోగాను ప్రత్యేక కార్యక్రమాలు లేకుంటే వార్షిక వేడుకలకు పరిమితం చేయవద్దన్నారు. మన శరీరాలను నమ్యతగా ఉండేలా తీర్చిదిద్దడంలో సహాయ పడుతుందన్నారు. ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి సహకరిస్తుందన్నారు. క్రమం తప్పకుండా సాధన చేస్తే మన శరీరం, మనస్సు గురించి జీవితాంతం యోగా అనేక విషయాలు మనకు బోధిస్తుందన్నారు.

ALSO READ: కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!

వృద్ధుల కోసం యోగా కాకుండా అన్ని వయసుల వారి కోసం ఉద్దేశించినదిగా చూడాలన్నారు. మానవుని గుర్తింపు విడిగా జీవించడం కాదని, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకమవ్వడంలోనే ఉందని బెంగాల్ గడ్డపై జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వసించారని గుర్తు చేశారు. ఈ అనుసంధానమే యోగా సారమన్నారు. దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి పరిశుభ్రమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన కోల్‌కతా ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని నరేంద్రమోదీ.

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×