E-Paper
Advertisement

తమిళ రాజకీయంలో దళపతి ఎంట్రీ.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి బరిలోకి విజయ్..

తమిళ రాజకీయంలో దళపతి ఎంట్రీ.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి బరిలోకి విజయ్..
Advertisement

TVK President Vijay: తమిళనాడు రాజకీయల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెండితెరపై దళపతిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న నటుడు విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడిగా ఆయన సోమవారం నాడు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేరుగా బరిలోకి దిగి ఈసారి ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ఒకరోజు ముందే.. ఆదివారం నాడు విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల సమీపంలో ‘యాంటీ డ్రగ్ ప్రొటెక్షన్ జోన్లను’ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాల రహిత తమిళనాడు అనే నినాదంతో ఆయన ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. యువతను ఉద్యోగ వేటగాళ్ల నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పట్టభద్రులకు నెలకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 2,000 చొప్పున నెలవారీ భృతిని అందిస్తామని ప్రకటించారు.

Advertisement

తన మేనిఫెస్టోలో స్థానిక ప్రజలకే స్థానిక ఉపాధి అనే కీలక పథకాన్ని ప్రకటించిన‌ విజయ్.. తమిళనాడులోని 75 శాతం ఉద్యోగాలను తమిళులకే దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, తమిళనాడును గ్లోబల్ క్రియేటర్ హబ్‌గా మార్చేందుకు క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్ స్కీమ్ను తీసుకువస్తామన్నారు. దీని ద్వారా 1.5 లక్షల మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రవ్యాప్తంగా 500 క్రియేటివ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో జాప్యం లేకుండా సమయానికి ఫలితాలు ఇచ్చేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చారు.

తమిళనాడులో ప్రస్తుతం అధికార డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA), ఏఐఏడీఎంకే-బీజేపీ మిత్రపక్షాల నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే, విజయ్ తన టీవీకే (TVK) పార్టీతో ఈ సమీకరణాలను మార్చేయాలని భావిస్తున్నారు. పెరంబూర్‌లో డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.డి. శేఖర్‌తో, తిరుచ్చి ఈస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్‌తో విజయ్ తలపడనున్నారు. రాజకీయ అరంగేట్రంలోనే ఇద్దరు బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పోటీ చేయడం విజయ్ సాహసోపేత నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. వెండితెరపై రికార్డులు తిరగరాసిన విజయ్, రాజకీయాల్లో కూడా అటువంటి విజయాన్నే అందుకుంటారా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. డ్రగ్స్ రహిత రాష్ట్రం, స్థానిక ఉపాధి వంటి విజయ్ హామీలు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

Read Also: ముగిసిన డెడ్‌లైన్.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్.. అమిత్ షా ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×