Alien Attack on Earth: నవంబర్‌లో భూమిపై దాడి జరగబోతుందట.. భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయట.. ఏంటి నమ్మడానికి కాస్త ఆలోచిస్తున్నారా? మేం కూడా అలానే అనుకున్నాం. కానీ బల్లగుద్దీ మరీ ఇదే జరగబోతుందంటున్నారు కొందరు సైంటిస్టులు. ఇంతకీ వారి కాన్ఫిడెన్స్ ఏంటి? అసలేం జరగబోతుంది?
నవంబర్‌లో భూమిపై గ్రహాంతర జీవుల దాడి!
జులైలో కొందరు సైంటిస్టులు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఓ అంతరిక్ష వాహనం భూమివైపుకు దూసుకువస్తుందని చెబుతున్నారు. నిజానికి ఇదేదో గ్రహశకలమో.. తోక చుక్కో అని భావించారు. కానీ అది దగ్గరికి వస్తున్న కొద్ది సైంటిస్టుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఏలియన్ టెక్నాలజీతో నడిచే స్పేస్ వెహికల్ అనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇది భూమివైపుకు కాకుండా.. సూర్యుడివైపుకు దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఇది గంటకు 2 లక్షల 9 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుందని గుర్తించారు.
న్యూయార్క్‌లోని మాన్‌హాటన్ పరిమాణంలో 3I/ATLAS
ఈ స్పేస్ వెహికల్ పరిమాణం.. న్యూయార్క్‌లోని మాన్‌హాటన్ అంత ఉందని చెబుతున్నారు. దీని వెడల్పు 10 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఆబ్జెక్ట్‌కు 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. ఇప్పుడీ సైంటిస్టులు చెప్పే విషయం ఏంటంటే.. ఇది సడెన్‌గా భూమిపై దాడి చేసే అవకాశం ఉంది అని. ఇలా వార్నింగ్‌లు ఇచ్చేవారు మాములు సైంటిస్టులు అయితే లైట్ తీసుకునే వారే. కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీరు. వీరిలో ఫేమస్ అస్ట్రో ఫిజిసిస్ట్ ఎవీ లోయెబ్ కూడా ఉన్నారు. అందుకే ఈ విషయాలను అంత సులువుగా ఎవరు కొట్టిపారేయడం లేదు.
2017లో ఒవుమువామువా అనే ఓ స్పేస్ ఆబ్జెక్ట్ గుర్తింపు
2017లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ఒవుమువామువా అనే ఓ స్పేస్ ఆబ్జెక్ట్‌ను కనుగొన్నారు. ఇది కూడా గ్రహాంతరజీవులు సృష్టించిందే అన్నారు. ఇప్పుడు దాని కంటే అట్లాస్ వేగంగా ప్రయాణిస్తుందని చెప్పారు. అంతేకాదు ఇది మన సోలార్ సిస్టమ్‌లోకి ఓ విభిన్న దిశ నుంచి ఎంటర్ అయ్యినట్టు గుర్తించారు సైంటిస్టులు.
మార్స్, జూపిటర్, వీనస్‌ను క్రాస్ చేసిన 3I/ATLAS
ఈ 3ఐ అట్లాస్ విషయంలో మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ స్పేస్ ఆబ్జెక్ట్ మార్స్, జూపిటర్, వీనస్ ను క్రాస్ చేసింది. ఆ గ్రహాలపై కొన్ని నిఘా పరికరాలను ఉంచినట్టు అనుమానిస్తున్నారు సైంటిస్టులు. ఇక నవంబర్ వరకు ఈ స్పేస్ ఆబ్జెక్ట్ సూర్యుడికి సమీపంలోకి వెళ్లనుంది. అప్పుడు దీనిని మనం భూమి నుంచి చూడలేం. ఇది కూడా ఏలియన్స్ కావాలని చేసే చర్యగా భావిస్తున్నారు సైంటిస్టులు.
మూడో వంతు వేగం కూడా వెళ్లని మన రాకెట్లు
ఇదే కనుక నిజంగా ఏలియన్ టెక్నాలజీ అయితే.. మనం వారికంటే చాలా వెనకపడి ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ స్పేస్ ఆబ్జెక్ట్ ప్రయాణించే వేగంలో మూడో వంతు వేగం కూడా మన రాకెట్లు వెళ్లవు. మరి నిజంగా ఇది ఏలియన్స్ స్పేస్ షిపేనా? లేక మన సైంటిస్టులు పొరపడ్డారా? అనేది తేలాలంటే నవంబర్ వరకు ఆగాలి. ఆ తర్వాత నిజంగా అది ఏ వస్తువైనా మనం కనుగొనలేం.. చూడలేం.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
3I/ATLASను గుర్తించిన ATLAS సర్వే టెలిస్కోప్
చిలీలోని రియో హర్టాడో వద్ద ఉన్న ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్.. సింపుల్‌గా అట్లాస్ సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించింది. అందుకే దీనికి 3ఐ/అట్లాస్ అని పేరు పెట్టారు. అయితే ఇది దాడి చేస్తుంది అనేది కేవలం ఒక ఊహా సిద్ధాంతమే.