Rain Alert: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. రోడ్లు, కాలువలు అన్ని వరదలై పారాయి. ప్రజలు మొత్తం బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. వర్షపు నీరు మొత్తం ఇంట్లోకి వచ్చి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఆఫీసులకు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అంతేకాకుండా ఈ వరదల్లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు.
తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు..
అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. అప్పుడే ఉక్కపోత వాతావరణం.. అప్పుడే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే గురువారం రోజూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. ఆఫీసులకు వెళ్లిన వారు తొందరగా ఇళ్లలోకి వెళ్లిపోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా నేడు కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గిండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరన నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో భారీ వర్షాలు..
తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే చాలా మంది మత్స్యకారులు గల్లంతయిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతం ఏపీలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతిపురం, ఎన్టీఆర్, విజయవాడ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.. భరించలేక యువతి ఆత్మహత్య..
వరదలపై సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి..
భారీ వర్షాల కారణంగా పంట పొలాలతో పాటు రోడ్లు, వంతెనలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయ్.. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వరద నష్టంపై నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ వరదలు పేదలకు, రైతులకు కష్టాలు మిగిల్చాయన్నారు. వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు సీఎం.