Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలే కాదు మరొకవైపు రాజకీయంగా కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టేశారు.. హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి అక్కడి ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఒకవైపు రాజకీయ నాయకుడిగా, మరొకవైపు హీరోగా చలామణి అవడమే కాకుండా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య.. కొన్ని ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు.. అంతేకాదు అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్తూ అభిమానులను సంతోష పెడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా తన స్వగ్రామం నిమ్మకూరుకు వెళ్లిన బాలకృష్ణ.. తన తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు, తల్లి బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నిమ్మకూరుకు వెళ్లడం సంతోషంగా ఉంది అని చెప్పిన బాలకృష్ణ.. అదే సమయంలో సోషల్ మీడియా తీరుపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన రాబోయే చిత్రం అఖండ 2 విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ…
సోషల్ మీడియాను మంచికి మాత్రమే వాడండి..
బాలకృష్ణ మాట్లాడుతూ.. ” సినిమాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనే లక్ష్యంతోనే సినిమాలు చేస్తున్నాను.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నాము. నా సంతోషాన్ని నా గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరుకు వచ్చాను. ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారంతా ఒక్కటే అన్నదే ఎన్టీఆర్ భావన. తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే పరస్పరం సహకరించుకుంటూ అండగా నిలవాలి. అపజయాల్లో కూడా ప్రాంతాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను. సోషల్ మీడియాను మంచికి వాడండి.. వినాశనానికి వద్దు.. మంచి ఉద్దేశంతోనే అఖండ 2 సినిమా చేస్తున్నాము. కులాలకు ఆపాదించకుండా హైంధవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము” అంటూ బాలయ్య తెలిపారు. అంతేకాదు అఖండ 2 సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు” అని కూడా క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పదవులు నాకు ముఖ్యం కాదు – బాలకృష్ణ
అలాగే తనకు పదవులు ముఖ్యం కాదు అని కూడా చెప్పుకొచ్చారు. “పద్మభూషణ్, దేశంలో మొదటి కళాకారుడిగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోవడం, సినిమా విజయాలు ఇవన్నీ కూడా ప్రజల విజయాలు గానే నేను భావిస్తున్నాను. పదవులు నాకు ఏ రోజు కూడా ముఖ్యంగా భావించలేదు. వాటిని కేవలం అలంకారం కోసమే భావించాను. నేను సాధించిన విజయాలన్నింటినీ కూడా నా తల్లిదండ్రులకే అంకితం చేస్తున్నాను.. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపుల్లోకి వెళ్లాలన్నదే నా కోరిక. నా ముఖ్య ఉద్దేశం కూడా.. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి బసవతారకం చేసిన సహకారం, త్యాగం ఎనలేనిది” అంటూ తన తల్లిదండ్రుల గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?