Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇవాళ టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ చేరుకోనున్నారు. టీమిండియా గ్రూపు ఏ లో ఉంది. గ్రూపులో ఏ కి సంబంధించి లీగ్ దశ మ్యాచ్ లు అన్ని కూడా దుబాయ్ లోనే జరుగనున్నాయి. గ్రూపు బీకి సంబంధించిన మ్యాచ్ లు అబుదాబీలో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ జరుగనుండటం విశేషం. అయితే ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్తగా మరో ఇద్దరూ ప్లేయర్లు జట్టుతో చేరనున్నారు. వారిలో ఇద్దరూ వికెట్ కీపర్లే ఉండటం విశేషం. మరోవైపు టీమిండియా ఆటగాళ్లలో శుబ్ మన్ గిల్, జస్ప్రిత్ బుమ్రా వంటి ఆటగాళ్లు ఇప్పటికే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్ నెస్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. మిగతా ఆటగాళ్లు మాత్రం యోయో, బ్రాంకో టెస్టులను పూర్తి చేయలేదు.
అయితే బీసీసీఐ వారికి ఈ టెస్టులను నిర్వహించదని టాక్ వినిపిస్తోంది. టీమిండియా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ స్థానంలో ఇషాన్ కిషన్, అభిషేక్ పొరెల్ వీరిద్దరిలో ఒకరిని దుబాయ్ కి పంపిస్తారట. ధ్రువ్ జురెల్ డెంగ్యూ తో బాధపడుతున్నట్టు సమాచారం. ఇందులో ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ని ఎంపిక చేశారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా ఎంపికయ్యారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ సెలెక్ట్ అయ్యారు. వాస్తవానికి ఇషాన్ కిషన్ కంటే కూడా అభిషేక్ అద్భుతంగా కీపింగ్ అండ్ బ్యాటింగ్ చేయనున్నట్టు సమాచారం.
టీమిండియా కి ధృవ్ జురెల్ అదృష్ట ఆటగాడిగా పేర్గాంచాడు. అయితే ఇటీవల టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడినప్పుడు ధ్రువ్ జురెల్ ఆడగా.. ఆ మ్యాచ్ విజయం సాధించాడు. టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న జురెల్ టీమిండియాకే అదృష్టమంతమైన ఆటగాడిగా మారుతున్నాడు. టెస్ట్ క్రికెట్ లో జురెల్ ఇప్పటివరకు 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అయితే ఆడిన ప్రతీ మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ జురెల్ డెంగ్యూ కారణంగా ఆసియా కప్ కి దూరం అవుతున్నాడని.. అతని స్థానంలో ఇషాన్ కిషన్, అభిషేక్ పొరెల్ లో ఒకరు వస్తారని వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.