wife killed Husband: వారిద్దరి భార్యాభర్తలు.. వివాహం జరిగింది దశాబ్దన్నర అవుతోంది. కాకపోతే అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. భర్త టార్చర్ తట్టుకోలేకపోయిన భార్య, ఏకంగా పైలోకానికి పంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ ఘటన ఒడిషాలో బయటపడింది. అసలు మనోరమ ఫ్యామిలీలో ఏం జరిగింది?
ఒడిశాలోని కేంద్ర పడా జిల్లా మలపట్న ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్త నిరంజన్, ప్రతీ రోజూ తాగి వచ్చి భార్య-పిల్లలను కొట్టేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు నిరంజన్. ఆ సమయంలో భార్య మనోరమతోపాటు పిల్లలతో గొడవకు దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టి మద్యం మత్తులో నిద్రపోయాడు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా, భర్త టార్చర్ పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయింది. ఫలితంగా నిద్రిస్తున్న నిరంజన్ గొంతుపై కాలితో తొక్కింది. ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసింది.
ఇదే విషయాన్ని పోలీసులకు వివరించింది. గురువారం నిరంజన్ మృతదేహం ఇంటి బయట పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి మనోరమ తన గోడును మీడియాతో వెళ్లబోసుకుంది. 15 ఏళ్లుగా భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నన్ను-ఇద్దరు పిల్లలను కొట్టేవాడని తెలిపింది. ఓ హోటల్‌లో పని చేస్తున్నానని, వచ్చే సంపాదనతోనే పిల్లలను పోషిస్తున్నానని వెల్లడించింది. భర్త విషయమై ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.
మూడు నెలలు జైలు శిక్ష తన భర్త అనుభవించాడని, బెయిల్‌పై వచ్చిన తర్వాత హింసించడం మొదలుపెట్టాడని వాపోయింది. బుధవారం రాత్రి తీవ్రంగా కొట్టడంతో ఈ నరకం భరించలేనని తాను, తన పిల్లలతో కలిసి చంపానని అసలు విషయాలు బయటపెట్టింది. ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడినట్టు వెల్లడించింది. ఆ ఘటన వెనుక తనకు కొడుకు, మైనర్ కూతురు సహాయం చేశారని చెప్పింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితురాలు మనోరమను అరెస్టు చేసిన పోలీసులు, ఆమెని విచారిస్తున్నారు. నిరంజన్ మరణం వెనుక పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని చెబుతున్నారు పోలీసులు.
ALSO READ: మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు