E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..
Advertisement

Intinti Ramayanam Today Episode October 9th: పల్లవి అవని పై కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పగలగొడుతూ ఉంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఆ అవని కాబట్టి దాని జీవితం ఎలాగైనా సరే నాశనం చేస్తాను అని అంటుంది. అయితే అవన్నీ నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి గెంటేసేలా చేసింది కాబట్టి దాని జీవితం ఎలాగైనా సరే కుక్కలు చింపిన విస్తరిని చేస్తాను అని పల్లవి తనను తానే వార్నింగ్ ఇచ్చుకుంటూ చాలా ఆవేశంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన జీవితం ఇలా అవడానికి అవని కారణం కాబట్టి తనకి ఊహించని షాక్ఇవ్వాలని పల్లవి అనుకుంటుంది. ఇక అంతే కాదు అక్కడ ఉన్న స్ట్రైట్నన్ని తీసుకొని తన చేతికి కాల్చుకుంటుంది. ఆ తర్వాత అవనికి జీవితం అంటే ఏంటో లేకుండా చేయాలి అని అనుకుంటుంది.

భరత్, ప్రణతిల మధ్య గొడవ..

పల్లవి ఇంట్లోకి రావడం ప్రణతికి అస్సలు ఇష్టం లేదు. అయితే పల్లవి ఇంట్లోకి వచ్చిన తర్వాత గొడవలు ఎక్కువ అవుతాయని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రణతి పల్లవి వదిన ఏదో చేసి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాంటి పనులు చేస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం భరత్ అని భరత్ చెప్పగానే భరత్ దీంట్లో నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అని అంటాడు.. ఇప్పుడు ఎందుకు సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అంటున్నావు అని ప్రణతితో గొడవ పడతాడు భరత్. అయితే భరత్ ప్రణతితో గొడవ పడుతున్నప్పుడు పల్లవి అక్కడికి వచ్చి మీ కమలన్న ఎలాంటి వాడు అది తెలుసుకో మీ అవని వదిన ఎలాంటిదో అది తెలుసుకో అంతేగాని నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని పల్లవి అంటుంది. మీరిద్దరూ నా కోసం గొడవ పడాల్సిన అవసరం లేదు అని పల్లవి కావాలనే భరత్ దగ్గర మంచి దానిలాగా మాట్లాడుతుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్.. 

Advertisement

పల్లవి తను మంచిది అవని చెడ్డది అంటూ ఇంట్లో వాళ్ళందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అవని నన్ను కావాలనే ఆ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నాలు చేసింది అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అయితే భరత్ ఒకప్పుడు అవని యొక్క చాలా మంచిది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అవని ఎలాంటిదో అర్థమైంది అంటూ భరత్ కూడా అనడంతో ప్రణతి చాలా భయపడిపోతూ షాక్ లో ఉండిపోతుంది. అక్క తమ్ముళ్ల మధ్య పల్లవి చిచ్చు పెడుతుంది అని భయపడిపోతూ ఉంటుంది ప్రణతి. కానీ భరత్ మాత్రం పల్లవి సిస్టర్ అంటూ చాలా ప్రేమగా తనకి భోజనానికి తల్లితో తినిపిస్తాడు. మీనాక్షి గోరుముద్దలు పెడుతూ ఉంటే పల్లవి తింటూ ఉంటుంది అయితే తను తల్లి ప్రేమతో పెట్టిన కూడా పల్లవి మాత్రం అయిష్టంగానే తింటుంది.

ఆరాధ్యకు షాక్.. 

ఆరాధ్య చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది అయితే ఇంట్లో అందరూ ఉన్నారు కదా మరి నన్ను తీసుకురావడానికి డ్రైవర్ని ఎందుకు పంపించారు అని అడుగుతుంది. ఏమైంది మీరందరూ అంత బాధ పడిపోతున్నారు అని అడుగుతుంది దానికి భానుమతి మీ అమ్మ చేసిన పనికి అందరూ ఇలా బాధపడిపోతున్నారు అని ఆరాధ్యతో భానుమతి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా అమ్మ ఏం చేసింది అసలు .. ఎందుకు మా అమ్మను అంటున్నారు అంటే మీ పల్లవి పిన్నిని మీ అమ్మ ఇంట్లో నుంచి పంపించేసింది అందుకే ఇప్పుడు ఇలా ఉంది అని అనగానే ఆరాధ్య అవనీని అడగడానికి లోపలికి వెళ్తుంది. అవినీ దగ్గరికి వెళ్లిన ఆరాధ్య పల్లవి పిన్ని నువ్వే ఇంట్లో నుంచి పంపించేసావని బామ్మ అంటుంది. ఎందుకు పంపించావ్ అమ్మ ఏమైంది అని అడుగుతుంది ఆరాధ్య కానీ అక్షయ్ మాత్రం ఏం కాలేదు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిదా అని ఏదో ఒకటి చెప్పి ఆరాధ్యను పంపించేస్తాడు.

భయపడుతున్న అవని.. 

Advertisement

పల్లవి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలానే చేస్తూనే ఉంటుంది కానీ తన జీవితం గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోవడం లేదు అని పల్లవి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది అవన్నీ. అది చూసిన అక్షయ్ ఏంటి అవని పల్లవి విషయంలో నువ్వు బాధ పడిపోతున్నావా భయపడుతున్నావా ఎందుకు అని అడుగుతాడు. ఇన్ని రోజులు నీ చెల్లెలు నువ్వు వెనకేసుకొని వచ్చావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇలాంటి తప్పులు చేసింది అని భయపడుతున్నావా ఏమి జరగదు నువ్వు ఏమి కంగారు పడకు అవని అని అంటారు. పల్లవి ఏదో చేస్తుంది అని నువ్వు మాత్రం అసలు భయపడదు ఏం చేసినా దానికి మనం భయపడకుండా ముందడుగు వేద్దామని అక్షయ అంటాడు.

కమల్ ఎమోషనల్ డైలాగ్.. 

నీకు రాత్రిగానే కమల్ తన అన్నయ్యలతో కలిసి మందు తాగాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని నువ్వు సంతోషంగా తాగుతున్నావా బాధతో తాగుతున్నావా అని అడుగుతుంది. నిజంగానే పల్లవి వెళ్ళిపోయినందుకు సంతోషంతోనే నేను తాగుతున్నాను వదినా అని అంటాడు కమల్. కానీ అవని మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది కమల్ ఇలా రావడానికి కారణం తనే అని ఫీల్ అవుతుంది కానీ కమల్ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వదు అది ఏమైనా ఒక్క మంచి పని చేసిందా అని అడుగుతాడు. కానీ కమల్ మాత్రం ఈ రోజు నన్ను ఆపొద్దు వదినా అని తాగుతూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

Big Stories

Advertisement
×