Chennai Road: చెన్నైలోని టైడల్ పార్క్ సమీపంలో గురువారం ఉదయం ఒక అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో రైల్ పనులు జరుగుతున్న ప్రదేశానికి కాస్త దూరంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో, అక్కడ వెళ్తున్న ఒక కారు ముందు భాగం ఆ గుంతలో ఇరుక్కుపోయింది.
ప్రమాదం జరిగిన తీరు
కారు గుంతలో చిక్కుకున్న మరుక్షణమే వెనుక నుంచి వచ్చిన ఒక బస్సు దానిని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బస్సు వెనుక భాగం కారును బలంగా ఢీకొట్టడంతో, కారు మరింత ముందుకు దూసుకెళ్లి లోతైన గుంతలో బోల్తా పడింది. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడ ఉన్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read: తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్
రహదారిపై ట్రాఫిక్ జామ్
ఈ ప్రమాదం కారణంగా ఆ కీలక మార్గంలో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలో పడిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీయించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కేవలం స్వల్ప గాయాల మాత్రమే అయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.