E-Paper
Advertisement

ఒరేయ్ దద్దమ్మల్లారా…ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా

ఒరేయ్ దద్దమ్మల్లారా…ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా
Advertisement

Basit Ali cooked Pakistan batters:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా గోల్డ్ మెడల్ దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంపై మాజీ ఆటగాడు బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకెప్పుడు టీమిండియాను ఓడిస్తారంటూ పాకిస్తాన్ క్రికెటర్లను కడిగిపారేశారు. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆటను కాపీ కొట్టైనా గెలవండి అంటూ పాకిస్తాన్ బ్యాటర్లకు సూచనలు చేశారు. భయం లేకుండా భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్నారని… వాళ్ల లాగా అటాకింగ్ చేయడం నేర్చుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడే టీమిండియాను డిఫెన్స్ లో పడేస్తామని వ్యాఖ్యానించారు. లేకపోతే మరో వెయ్యి జన్మలెత్తిన టీమిండియాను ఓడించడం కష్టమేనని బాంబు పేల్చారు. దీంతో టీమిండియా ఓపెనర్ల ఆటపై బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా

భారత ఓపెనర్ లను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మ్యాచ్ లో అయినా పవర్ ప్లే లో టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారని వివరించారు. ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని టార్గెట్ చేస్తూ, దూకుడుగా ఆడుతున్నారని తెలిపారు. వికెట్ పడుతుందని భయం లేకుండా సిక్సర్లు, బౌండరీలు కొట్టి… ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని గుర్తు చేశారు. టి20 క్రికెట్ లో ఇలాంటి దూకుడు చాలా అవసరమని వెల్లడించారు. అందుకే టీమిండియా భారీ స్కోర్లు నమోదు చేయడమే కాకుండా… విజయాలు సాధిస్తోందని గుర్తు చేశారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

అయితే ప్రత్యర్థి టీమిండియా ఓపెనర్లు ఇంత బాగా ఆడుతున్న క్రమంలో… పాకిస్తాన్ క్రికెటర్లు ఏం పీకుతున్నారని ఈ నిలదీశారు. టీమిండియా ఓపెనర్లను చూసి నేర్చుకోవాలని… లేదా కాపీ అయిన కొట్టాలంటూ సెటైర్లు పేల్చారు. వికెట్ పడుతుందని భయపడకుండా ఆడాలని కోరారు. పవర్ ప్లే సమయంలో పాకిస్తాన్ ప్లేయర్లు జాగ్రత్తగా ఆడుతున్న క్రమంలో వికెట్లు పోల్పడుతున్నారని.. వివరించారు. ఇక్కడే పాకిస్తాన్ విఫలమవుతోందని తెలిపారు. టీమిండియా తరహాలో పవర్ ప్లే లోనే అటాకింగ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.

రోహిత్ శర్మ, యశస్వి, సంజు కూడా అదే దూకుడు

Advertisement

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్ సందర్భంగా అభిషేక్ శర్మతో పాటు వైభవ్ ఓపెనర్లుగా బరిలోకి దిగి హిట్టింగ్ చేసే ప్రయత్నం చేశారని బాసిత్ అలీ గుర్తు చేశారు. ఇతర ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కూడా ఇలాగే విరుచుకుపడతారని వెల్లడించారు. ఓపెనర్ గా వచ్చామంటే సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టడమే అన్నట్టుగా వాళ్ళ ఆట ఉంటుందని గుర్తు చేశారు. అదే ఫార్ములాను ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అమలు చేయాలని సూచనలు చేశారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీలు కొట్ట‌లేడు…అదే జ‌రిగితే నా పేరు మార్చుకుంటా !

ఇన్‌స్టాగ్రామ్‌లో న‌న్ను విరాట్ కోహ్లీ బ్లాక్ చేశాడు.. మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌నం

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

Big Stories

Advertisement
×