Woman Bit: ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. ఫలితంగా తట్టుకోలేకపోయిన వదిన, స్వయంగా మరిది ప్రైవేటు పార్ట్స్‌ని కొరికేసింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలోని వెలుగుచూసింది. బాధితుడికి దాదాపు 55 కుట్లు వేసినట్టు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్లే..
యూపీలోని కాన్పూర్ సిటీ పరిధిలోని శుక్రవారం సాయంత్రం సజేతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఘటన జరిగింది. సజేతి గ్రామంలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. మహిళ భర్త అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. సదరు మహిళ.. తన పిల్లలతో కలిసి మామ ఇంట్లో ఉంటోంది. ఆ ఇంట్లో ఆమె మరిది కూడా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తాయి.
37 ఏళ్ల చిన్న కొడుకు తన కుటుంబంతో కలిసి ఆ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లల విషయంలో మరిది-వదినకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పట్టరాని కోపంతో వదిన.. మరిది, మామతో గొడవకు దిగింది. ఈ గొడవలో వదిన తన మరిది బట్టలు విప్పేసి, అతడి ప్రైవేటు పార్ట్స్‌ని పళ్లతో కొరికేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గాయపడిన వ్యక్తిని ఘటంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అతడ్ని కాన్పూర్‌లోని ఉర్సులా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ALSO READ: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే
అయతే ఆ మహిళ మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం వచ్చిన బాధితుడికి దాదాపు 55 కుట్లు డాక్టర్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.