Bigg Boss 10 Shalini: బిగ్ బాస్ సీజన్ 10లో మిగతా కంటెస్టెంట్స్ ఒక ఎత్తు అయితే.. కామనర్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన షాలిని (Shalini)మరో ఎత్తు. హౌస్ లో ఉన్నంత సేపు తనదైన స్క్రీన్ స్పేస్ కోసం గొడవలు పడుతూ.. మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె హౌస్ లో నుంచి వెళ్ళిపోతే బాగుండు అని కోరుకునే కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా లేకపోలేదు. అయితే ఈమెను హౌస్ నుండి బయటకు పంపిస్తున్నట్టే పంపించి, సీక్రెట్ రూమ్ లోకి పంపించి, మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇకనైనా తన ప్రవర్తనలో మార్పు వస్తుంది అని ఆశగా ఎదురుచూసిన ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. మళ్లీ వచ్చి రాగానే దక్షితో ఒక రేంజ్ లో గొడవ పెట్టుకున్న ఈమె.. దెబ్జానీతో నీకిష్టం వచ్చింది చేసుకో అంటూ ఫైర్ అయ్యింది.
హౌస్ లోకి వచ్చి రాగానే మనశ్శాంతిగా ఉంది.. ఇంకా గొడవలు లేవే అని ఆలోచిస్తున్న లోపే మరో గొడవ వచ్చింది అంటూ తనకు తానే చెప్పుకొని కామెంట్లు చేసిన ఈమె.. వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా హోస్ట్ నాగార్జున చేత కూడా చివాట్లు పడింది. అలాంటి ఈమెను ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ బిగ్ బాస్ కి అంటూ హోస్ట్ నాగార్జున చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . ఈ ట్విస్ట్ ఏంటి స్వామి అంటూ నోరెళ్ళబెడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా 49వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో ని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇక అందులో భాగంగానే డాన్యుబ్ ప్రాపర్టీస్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్ రిజ్వాన్ సాజిన్ గెస్ట్ గా వచ్చారు. ఇక కంటెస్టెంట్స్ ను కలిసిన ఆయన దీపావళి సందర్భంగా కంటెస్టెంట్స్ కోసం స్పెషల్ మిఠాయిలు తీసుకొచ్చాను అని చెప్పి వాళ్లను సర్ప్రైజ్ చేశారు.
రిజ్వాన్ స్టేజ్ పైకి రాగానే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. “రిజ్వాన్ గారు బిగ్ బాస్ డాన్యూబ్ గ్రూపు కి షాలిని బ్రాండ్ అంబాసిడర్” అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈ విషయం హోస్ట్ నాగార్జున చెప్పడంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో నుండి షాలిని బయటకు వెళ్లాలని మేమంతా ఎదురు చూస్తుంటే.. మీరేమో బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటిస్తున్నారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొకరేమో ఏకంగా షాలిని , రోహిత్ రొమాన్స్ కి దుబాయ్ నుండి పెద్దాయన దిగి వచ్చాడు అంటూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించి అభిమానులను మాత్రం సర్ప్రైజ్ చేశారు నాగార్జున.
ALSO READ: ఫౌజీ మూవీపై ట్రోల్స్.. నందమూరి హీరో మూవీతో పోలుస్తూ!
ఇకపోతే ఫన్ టాస్క్ నిర్వహించగా.. అందులో ముగ్గురిని జాతి రత్నాలు అంటూ ప్రకటించారు. షాలిని బొమ్మ గీస్తే, నీతూ దానిని ఐడెంటిఫై చేయాలి. ఇక వీళ్ళిద్దరికీ జాతి రత్నాలు అనే సినిమా టైటిల్ టాస్క్ గా వచ్చింది. అయితే షాలిని ఆ జాతి రత్నాలు పేరును చెప్పడానికి కొన్ని బొమ్మలు గీస్తుండగా.. హోస్ట్ నాగార్జున ఇదేదో ఫ్యామిలీ ప్లానింగ్ లాగా ఉందే అంటూ చెప్పి నవ్వించాడు. నాగార్జున మాట్లాడుతూ.. మీకు సింపుల్ గా అర్థమవడం కోసం మూడు పేర్లు చెప్తాను అంటూ త్రిగుణ్, రోహిత్, అమన్ అని చెప్పగా నరేష్ మాట్లాడుతూ యెల్లో కార్డు తీసుకున్న ముగ్గురు జాతి రత్నాలు సార్ అంటూ అందర్నీ నవ్వించారు. మొత్తానికైతే ఈసారి హౌస్ లో ఏకంగా ముగ్గురు ఎల్లో కార్డ్స్ తీసుకొని విమర్శలు ఎదుర్కొన్నారు.