E-Paper
Advertisement

Powerful Armies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాలు ఇవే, టాప్ ప్లేస్ ఆ దేశానిదే!

Powerful Armies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాలు ఇవే, టాప్ ప్లేస్ ఆ దేశానిదే!
Advertisement

World’s Most Powerful Armies: గత కొంత కాలంగా ప్రపంచ అగ్ర దేశాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. తాజాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల తాజా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను, వాటి వనరులు, వాటి దగ్గర ఉన్న ఆయుధాల ఆధారంగా అంచనా వేసింది. మొత్తం 60 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ 10లో భారత్ నిలువగా, పాకిస్తాన్ ఈ లిస్టులో చోటు దక్కించుకోకపోవడం విశేషం.

ప్రపంచంలో శక్తివంతమైన సైనిక దేశాలు

⦿ 2025లో అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. పవర్ ఇండెక్స్ స్కోరు 0.0744గా సాధించింది. యుఎస్ఏ ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కలిగి ఉన్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో ఏకంగా $873 బిలియన్ల(రూ. 77.54 లక్షలు కోట్ల) రక్షణ బడ్జెట్ ను కలిగి ఉంది.

Advertisement

⦿ రెండో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశంగా రష్యా గుర్తింపు తెచ్చుకుంది. పవర్‌ ఇండెక్స్ స్కోరు 0.0788ను కలిగి ఉంది. రష్యా పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకుల పరంగా, ఇది రెండవ స్థానంలో నిలిచింది.

⦿ మూడో శక్తివంతమైన సైన్యంగా చైనా గుర్తింపు తెచ్చుకుంది. పవర్‌ ఇండెక్స్ స్కోరు 0.0788ను కలిగి ఉంది.

Advertisement

⦿ 2025లో 0.1656 పవర్‌ ఇండెక్స్ స్కోరుతో దక్షిణ కొరియా ప్రపంచంలో ఐదవ అత్యంత శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్‌కే పగ్గాలు?

⦿ 0.1785 పవర్‌ ఇండెక్స్ స్కోర్‌ తో యునైటెడ్ కింగ్‌ డమ్ 6వ స్థానంలో ఉంది.

⦿ 0.1878 పవర్‌ ఇండెక్స్ స్కోరుతో ఫ్రాన్స్ 7వ స్థానంలో ఉంది.

⦿ 0.1839 పవ ర్‌ఇండెక్స్‌ స్కోరుతో జపాన్ ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత శక్తివంతమైన సైన్యంగా నిలిచింది.

⦿ 0.1902 పవర్‌ ఇండెక్స్ స్కోరుతో టర్కీ తొమ్మిదవ స్థానంలో ఉంది. ఫ్రిగేట్ నౌకాదళాలు, అటాక్ హెలికాప్టర్లు, నావల్ కార్వెట్‌లు, జలాంతర్గాములతో బలమైన సైన్యాన్ని కలిగి ఉంది.  ఇటలీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాలలో పదవ స్థానంలో ఉంది. ఈ NATO సభ్యదేశానికి 0.2164 పవర్‌ ఇండెక్స్ పవర్ స్కోరును కలిగి ఉంది.

భారత్ సైనిక ర్యాంక్ ఎంత అంటే?

సైనిక బలం పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది. 0.1184 పవర్ ఇండెక్స్‌ స్కోరుతో..  చైనా కంటే కేవలం ఒక అడుగు వెనుక ఉంది. 14.5 లక్షల మంది సైనిక శక్తిని కలిగి ఉంది. అధునాతన ఆయుధాలు, అణు శక్తిని ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఆధునీకరించడంపై దృష్టి పెట్టడం వల్ల ఈ ర్యాంకును పొందింది.

Read Also:  నాలుగు నగరాల్లో భారీ విధ్వంసానికి కుట్ర, ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే?

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×