E-Paper
Advertisement

World’s Richest Village: ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామం.. ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్, ఎక్కడో తెలుసా?

World’s Richest Village: ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామం.. ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్, ఎక్కడో తెలుసా?

World’s Richest Village: దేశంలో గ్రామాలు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. అంతేకాదు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో బిలియనీర్ల గురించి ఏ ఒక్కరూ ఆలోచించరు. ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్ ఉంటాడు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఇది కళా.. నిజామా? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది?

ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామం

దేశంలోని గుజరాత్ గురించి చెప్పనక్కర్లేదు. ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేయడానికి అక్కడి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. గుజరాత్‌లోని భుజ్ ఏరియా గురించి చాలామంది వినే ఉంటారు. ఓసారి భూకంపం వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఏరియాలు భారీగా డ్యామేజ్ అయ్యాయి. భుజ్ ఏరియాలోని మాధాపర్ గ్రామం గురించి చాలా మంది తెలీయదు.

నార్మల్‌గా అయితే గ్రామాల్లో బ్యాంకులు పెట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల బ్యాంకులు మొగ్గు చూపవు. ఆ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. వాటిలో HDFC, SBI, PNB, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంకులతో మరికొన్ని ఉన్నాయి.

గుజరాత్‌లోని ఆ గ్రామం.. ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్

మరిన్ని బ్యాంకులు తమ శాఖలను అక్కడ ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. వివిధ నివేదిక ప్రకారం.. ఈ గ్రామంలో 17 బ్యాంకుల్లో దాదాపు 5 వేల నుంచి 7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అక్కడ ప్రతి ఇంట్లో ఒక లక్షాధికారి లేదా బిలియనీరు ఉంటారు. మాధాపర్ గ్రామంలో దాదాపు 7,600 ఇళ్లు ఉంటాయి. సుమారు 92 వేల మంది జనాభా ఉంటుంది.

మాధపర్ గ్రామంలో శుభ్రంగా ఉంటుంది. విశాలమైన రోడ్లు, పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, పార్కుల గురించి చెప్పనక్కర్లేదు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం సగటున ఒక్కొక్క వ్యక్తి బ్యాంకు ఖాతాలో దాదాపు 15 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నట్లు చెబుతున్నాయి.  ఈ గ్రామానికి ఇదంతా అకస్మాత్తుగా వచ్చిన సంపద కాదు.

ALSO READ: గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్.. విద్యుత్ బకాయిలపై సుప్రీంకోర్టు కీలక అదేశం

ఈ సంపదకు అసలు కారణం అక్కడి NRI కుటుంబాలు. వారు ప్రతీ ఏడాది స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఆ గ్రామానికి చెందిన 1,200 కుటుంబాలు విదేశాల్లో నివాసం ఉంటున్నారు. అక్కడ పటేల్, మిస్త్రీ కమ్యూనిటీలకు చెందినవారు ఉంటారు. ఐరోపా, అమెరికా , కెనడా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కుగా వ్యాపారాలు చేస్తుంటారు.  వారంతా తమ సంపదను గ్రామంలోకి తిరిగి పంపుతారు.

చాలా మంది విదేశాల్లో ఉంటున్నా, తమ గ్రామానికి దగ్గరగా ఉంటారు. వారు నివాసం ఉండే చోటు కంటే తమ గ్రామాల్లోని బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారని స్థానిక రాజకీయ నేతలు చెబుతుంటారు. భారీ డిపాజిట్ల ద్వారా ఆ గ్రామం మరింత సంపన్నం చేసిందని స్థానిక బ్యాంకు అధికారులు చెబుతుంటారు. మొత్తానికి మాధాపర్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరు సంపాదించుకుంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×