E-Paper
Advertisement

25 ఏళ్ల సీక్రెట్ లవ్ తెచ్చిన చిక్కులు… రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్

25 ఏళ్ల సీక్రెట్ లవ్ తెచ్చిన చిక్కులు… రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Japanese Romantic Thriller: ప్రేమ ఎంత మధురం అనుకుంటారు ప్రేమలో ఉన్న వాళ్ళు. కానీ అదే ప్రేమ ఎంతో మందికి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇష్టం కాస్తా పిచ్చిగా మారితే ఆ నరకం ఎలా ఉంటుందో తెలియాలంటే ’25 ఇయర్స్ ఆఫ్ యూ’ (25 Years of You series) అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ప్రేమ అంటే కేవలం హృదయాల మధ్య బంధం కాదు, కొన్నిసార్లు అదొక దీర్ఘకాల గాయం కూడా కావచ్చు అనిపించే ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? సినిమా స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ పేరు సోటా యుకిమురా. అతనో మామూలు ఆఫీస్ ఉద్యోగి. కానీ అతని హృదయంలో 25 ఏళ్లుగా ఒక సీక్రెట్ దాగి ఉంది. చిన్నప్పటి నుంచి మరికో నోస్ అనే యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అది వన్ సైడ్ లవ్. ఆ ప్రేమను ఎప్పుడూ ఆమె ముందు ఎప్పుడూ వ్యక్తం చేయడు. ఆమెను దూరం నుంచి గమనిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. ఈ సుదీర్ఘ మౌనం వెనుక ఒక భయంకరమైన గతం ఉంటుంది.

Advertisement

సరిగ్గా 25 ఏళ్ల క్రితం… వాళ్ళ చిన్నతనంలో జరిగిన ఒక దారుణ సంఘటన సోటా మనసులో మానని గాయం చేసి ఉంటుంది. ఆ సంఘటన రహస్యం అతన్ని ఆమెను దగ్గరకు రానివ్వదు. కానీ ఒక రోజు మరికో తండ్రి హీరోయిన్ ను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తాడు. ఆ సమయంలో సోటా తన 25 ఏళ్ల మౌనాన్ని వీడి, ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. సోటా ఆమె జీవితంలోకి ప్రవేశించిన క్షణం నుంచి వాళ్ళ జీవితం ప్రమాదకరమైన మలుపులు తిరుగుతుంది.

సోటా చూపిస్తున్న ప్రేమ స్వచ్ఛమైనదా లేక సైకోటిక్ అబ్సెషన్‌గా మారిందా ? ఆమె గురించి అన్నీ తెలుసుకోవాలనే అతని కోరిక వాళ్ళను ఎలాంటి ప్రమాదంలో పడేస్తుంది ? గతంలో జరిగిన ఆ దారుణ సంఘటన ఏంటి ? దాని వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

Advertisement

జపనీస్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ’25 ఇయర్స్ ఆఫ్ యూ’. దీని ఒరిజినల్ టైటిల్ Kokuhaku 25-nenme no Himitsu. జూలై 17న Netflixలో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం జపనీస్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్ వంటి భాషలలో సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. 25 ఏళ్ల రహస్యం చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

Read Also : రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

Tags

Related News

21 కోట్ల కోసం బ్లడీ డేంజరస్ డెత్ గేమ్… క్లైమాక్స్ కిరాక్ మావా

నడిసంద్రంలో కొట్టుమిట్టాడే 23000 ప్రాణాలు… మస్ట్ వాచ్ సోషల్ ఇష్యూ డ్రామా

రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

అక్కకు రక్తం ధారబోయడానికే పుట్టాను అనుకునే అమాయకురాలు… హార్ట్ టచింగ్ సిరీస్

ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ

యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్

అల్లరి అసుర పిల్లల రచ్చ… కిడ్స్ తో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్

Big Stories

Advertisement
×