E-Paper
Advertisement

OTT Movie: ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు వెళ్తే అరాచకం… ఆ ఒక్క మందుతో మనిషి మృగంలా.. మతిపోగొట్టే మూవీ మావా

OTT Movie: ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు వెళ్తే అరాచకం… ఆ ఒక్క మందుతో మనిషి మృగంలా.. మతిపోగొట్టే మూవీ మావా
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో ఒక హెల్త్ డీసీజ్ కారణంగా హీరో ముఖం కురూపిలా మారిపోతుంది. ఎన్నో అవమానాలు పడతాడు. ముఖం మార్చుకుంటే లైఫ్ మారుతుందని అనుకుంటాడు. కానీ ముఖం మారినా రాత మారలేదని తెలుసుకుంటాడు. ఈ సినిమా చాలా సున్నితంగా, ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమానే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఎ డిఫరెంట్ మ్యాన్’ (A Different Man) 2024లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా. ఆరోన్ షిమ్‌బర్గ్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. ఇందులో సెబాస్టియన్ స్టాన్, రెనాట్, ఆడమ్ పీర్సన్ లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2024లో సండాన్స్ బెర్లిన్ ఫెస్టివల్ కాంపిటీషన్ లో ప్రీమియర్ అయింది. సెబాస్టియన్ స్టాన్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. 2024 సెప్టెంబర్ 20న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టివిలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్ లో ఎడ్వర్డ్ అనే వ్యక్తి ఉంటాడు. అతని ముఖం మొత్తం న్యూరోఫైబ్రోమాటోసిస్ అనే రేర్ డిసీజ్ వల్ల ట్యూమర్స్‌తో నిండి ఉంటుంది. అతను యాక్టర్ గా చిన్న చిన్న వేశాలు వేస్తుంటాడు. చాలా ఆడిషన్స్‌లో రిజెక్ట్ అవుతూ, ఒంటరిగా బతుకుతుంటాడు. అతని ముఖానికి తగ్గట్టు ఎవరైనా వేషాలు ఇస్తే చేస్తుంటాడు. అతని పక్క ఇంటి అమ్మాయి ఇన్వెట్టాతో అతనికి పరిచయం అవుతుంది. ఆమె కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటుంది. ఈ సమయంలో ఆమె ఎడ్వర్డ్ స్టోరీని రాయడం మొదలెడతుంది. ఆమె మీద ఎడ్వర్డ్ కి ఫీలింగ్స్ మొదలవుతాయి. ఒక రోజు ఎడ్వర్డ్ కి ఎక్స్‌పెరిమెంటల్ ట్రీట్‌మెంట్ గురించి తెలుసుకుని ట్రయల్‌లో జాయిన్ అవుతాడు. ఆశ్చర్యకరంగా ఒక ఇంజెక్షన్ తో అతని ముఖం మొత్తం మామూలుగా అయిపోతుంది.

Read Also : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

Advertisement

కొన్ని వారాల తర్వాత అతను కొత్త ముఖంతో బయటకు వస్తాడు. హ్యాండ్‌సమ్ గా కాన్ఫిడెంట్ తో పాత ఎడ్వర్డ్‌ని చంపేసి, కొత్త పేరు పెట్టుకుని రియల్ ఎస్టేట్ జాబ్ లో జాయిన్ అవుతాడు. లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఒకప్పుడు ఛీదరించుకున్న ప్రజలు ఇప్పుడు అతన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఇన్వెట్టాతోనే ఫ్లర్ట్ చేయడం మొదలెడతాడు. ఆమెను తన లైఫ్ పార్టనర్ గా చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇక్కడే స్టోరీ ఎవరూ ఊహించని మలుపు తీసుకుంటుంది ? ఎడ్వర్డ్ కి ఒక్క సారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ మలుపు ఏమిటి ? ఇన్వెట్టా ఇచ్చే షాక్ ఏమిటి ? ఎడ్వర్డ్ జీవితం ఎటు వెళ్తుంది ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×