E-Paper
Advertisement

Serial Actor kaushik : డబ్బుల కోసం నిద్రలేని రాత్రులు గడిపాను.. ఐదు సీరియల్స్.. సూపర్ అంతే..

Serial Actor kaushik : డబ్బుల కోసం నిద్రలేని రాత్రులు గడిపాను.. ఐదు సీరియల్స్.. సూపర్ అంతే..
Advertisement

Serial Actor kaushik : తెలుగు బుల్లితెర యాక్టర్ కౌశిక్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్లలోను నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ‘ఆరుగురు పతివ్రతలు’, ‘శీను వాసంతి లక్ష్మీ’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు.. ఇటీవల జరిగిన సీరియల్స్ అసోసియేషన్ మా ఎన్నికల్లో గెలుపొందాడు.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశాడు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తున్న కౌశిక్ ఇప్పుడు మాత్రం సీరియల్స్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈమధ్య కేవలం బుల్లితెరపై ప్రసారమవుతున్న పండగల ఈవెంట్లలో ఈయన కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డబ్బుల కోసం ఆయన పడిన కష్టాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఒకేసారి ఐదు సీరియల్స్.. గ్రేట్ కదా..

తెలుగు సీరియల్ నటుడు కౌశిక్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాలు, సీరియల్స్లలో వరసగా నటిస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మొదట సినిమాలు చేసి, ఆ తర్వాత సీరియల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఈ మధ్య సీరియల్స్ లలో కనిపించలేదు. కానీ బుల్లితెర పై సందడి చేస్తున్నారు. అలాగే పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన ఇండస్ట్రీ లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి ఐదు సీరియల్స్ లలో నటించినట్లు తెలిపారు.. అప్పటిలో కుటుంబ పరిస్థితుల కారణంగా అలా చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజుకు అవమానం.. అదే అతని ధైర్యం..

అప్పటిలో రెమ్యూనరేషన్ ఇదే.. 

ఇప్పట్లో లాగా ఒక్క రోజుకి వేలకు వేలు రెమ్యూనరేషన్ ఆర్టిస్టులకు అప్పట్లో ఇవ్వలేదు. అప్పటి పరిస్థితులను బట్టి కేవలం వందల్లోనూ లేదా వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. సీరియల్ నటుడు కౌశిక్ ఒకేసారి నాలుగైదు సీరియల్స్ చేస్తూ అప్పట్లో బిజీగా ఉండేవారు. అయితే ఆయన రెమ్యూనరేషన్ మాత్రం ఐదు సీరియల్స్ కి కలిపి 2500 లేదా 3 వేలు ఉండేదట.. అంటే ఒక్కో సీరియల్ కు 500పైగా తీసుకొనేవారట. అప్పటిరోజుల్లో ఖర్చులు తక్కువే.. కానీ ఇప్పుడు మాత్రం కొత్త ఆర్టిస్ట్ కూడా 15 వేలకు తక్కువ తీసుకోవడం లేదని టాక్.. నిజంగా ఆ రోజుల్లో అన్ని సీరియల్స్ చేసి ప్రేక్షకులను అలరించిన కౌశిక్ గ్రేట్ అని చెప్పాలి. ప్రస్తుతం మా సీరియల్స్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పాటుగా త్వరలోనే డైరెక్టర్గా కూడా మారబోతున్నట్లు ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. అయితే సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన డైరెక్టర్ గా ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారు? ఆ సినిమా ఆయనకు ఏ మాత్రం సక్సెస్ ని అందిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×