E-Paper
Advertisement

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్
Advertisement

Fantasy Adventure Comedy OTT : ఓ గేమ్‌లో ఉండే క్యూబిక్ ప్రపంచం నిజంగా మన ముందుకొస్తే ? అక్కడి నుంచి బయట పడాలంటే మన ఊహాశక్తి, ధైర్యం, క్రియేటివిటీనే ఆయుధాలుగా మార్చుకోవాల్సి వస్తే ? సాధారణ జీవితంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్న నలుగురు వ్యక్తులు అనుకోకుండా ఓ వింత ప్రపంచంలోకి వెళ్లి, అక్కడి ప్రమాదాలను ఎదుర్కొంటే ఎలా ఉంటుంది ? ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ కథే ‘ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ’ (A Minecraft Movie). ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను బ్లాక్స్‌ తో నిండిన ఓవర్‌ వరల్డ్‌ లోకి తీసుకెళ్తుంది. మరి ఈ నలుగురు ఓవర్‌వరల్డ్‌లోకి ఎలా వెళ్లారు ? అక్కడ వారికి ఎదురైన ప్రమాదాలేంటి ? చివరికి తమ ప్రపంచానికి తిరిగి వచ్చారా ? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

నిజ జీవితంలో తమ తమ పర్సనల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న గారెట్, హెన్రీ, నటాలీ, డాన్ అనే నలుగురు వ్యక్తులు ఉంటారు. అనుకోకుండా ఓ రహస్యమైన పోర్టల్‌ ద్వారా వింతైన క్యూబిక్ ప్రపంచమైన ఓవర్‌ వరల్డ్‌ లోకి ప్రవేశిస్తారు. అక్కడ కనిపించే ప్రతి వస్తువు బ్లాక్స్‌ రూపంలో ఉంటుంది. చెట్లు, కొండలు, ఇళ్లు మాత్రమే కాదు… ఆ ప్రపంచంలోని జీవులు కూడా గేమ్‌ లో చూసినట్టుగానే కనిపిస్తాయి.

Advertisement

మొదట ఈ కొత్త ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఈ నలుగురికి, కొద్దిసేపటికే అసలు సమస్య అర్థమవుతుంది. ఇక్కడి నుంచి తమ నిజ జీవితానికి ఎలా తిరిగి వెళ్లాలో వారికి తెలియదు. అదే సమయంలో ఓవర్‌ వరల్డ్‌ లోనే నివసిస్తూ క్రాఫ్టింగ్‌ లో నిపుణుడిగా మారిన స్టీవ్ పరిచయం అవుతాడు. ఈ వింత ప్రపంచంలో బతకాలంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదని, సరైన వస్తువులను తయారు చేసుకోవడం, పరిసరాలను అర్థం చేసుకోవడం, తమ ఊహాశక్తిని ఉపయోగించడం కూడా అవసరమని స్టీవ్ వాళ్ళకి చెబుతాడు.

అలా ఇంటికి తిరిగి వెళ్లే మార్గం కోసం ప్రయత్నిస్తున్న ఈ నలుగురు, ఓవర్‌ వరల్డ్‌ ను నాశనం చేయాలనుకునే ప్రమాదకరమైన జీవులతో పోరాడాల్సి వస్తుంది. పిగ్లిన్స్, జాంబీస్ వంటి శత్రువులు వారి ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తారు. మొదట తమను తాము కాపాడుకోవడమే కష్టంగా భావించిన ఈ బృందం, క్రమంగా ఒకరిపై ఒకరు ఆధారపడటం నేర్చుకుంటుంది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. సాధారణ జీవితంలో తమకు సమస్యలుగా కనిపించిన విషయాలే, ఈ కొత్త ప్రపంచంలో పరిష్కారాలుగా మారతాయి.

Advertisement

తమలోని భయాన్ని జయిస్తూ, స్టీవ్ సహాయంతో వారు ఓవర్‌ వరల్డ్‌ ను కాపాడే బాధ్యతను కూడా తీసుకుంటారు. చివరికి ఈ బృందం దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొంది ? ఓవర్‌ వరల్డ్‌ ను రక్షించగలిగిందా ? తమ నిజ జీవితానికి తిరిగి వెళ్లేందుకు మార్గాన్ని ఎలా కనుగొన్నారు ? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం. అడ్వెంచర్‌తో పాటు స్నేహం, టీమ్‌వర్క్, క్రియేటివిటీకి సంబంధించిన సందేశాన్ని ఈ సినిమాలో చూడవచ్చు.

Also Read : 80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఓటీటీలో తెలుగులో ఉందా?

‘ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ’ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ చిత్రం. ప్రస్తుతం ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar)లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తెలుగు వెర్షన్ విడుదలైనప్పటికీ, ఓటీటీలో మాత్రం ప్రస్తుతానికి తెలుగు ఆడియో అందుబాటులో లేదు. జాసన్ మోమోవా, జాక్ బ్లాక్, ఎమ్మా మైయర్స్, సెబాస్టియన్ హాన్సెన్, డేనియల్ బ్రూక్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 150 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 960 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, 2025లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. వీడియో గేమ్ ఆధారంగా వచ్చిన సినిమాల్లోనూ ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. గేమింగ్ ప్రపంచాన్ని ఇష్టపడేవారు, ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడాలనుకునేవారు, ఫాంటసీ అడ్వెంచర్ కథలను ఆస్వాదించేవారికి ‘ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ’ మంచి టైమ్‌పాస్ మూవీగా నిలుస్తుంది.

Tags

Related News

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

Big Stories

Advertisement
×