E-Paper
Advertisement

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు..  వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?
Advertisement

KTR Car: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  ఘటన సమయంలో ప్రమాదానికి గురైన కారులో కేటీఆర్‌ ముందు కూర్చొన్నారు. దీంతో కారు పక్కభాగం స్వల్సంగా డ్యామేజ్ అయ్యింది. ఘటన ఎలా జరిగింది?

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌లో నిర్వహించనున్న సభకు వెళ్తున్న సమయంలో కేటీఆర్‌ అల్గునూర్‌ ప్రాంతంలో ఆగారు. ఆ సమయంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు.

కరీంనగర్ జిల్లా అల్గునూర్‌ వద్ద ఘటన

Advertisement

ఆ తర్వాత కారులోకి ఎక్కి ముందు సీటులో కేటీఆర్ కూర్చొన్నారు. ఆ పక్క నుంచి వెళ్తున్న లారీ ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కేటీఆర్ కారు డోర్‌ డ్యామేజ్ అయ్యింది. ప్రమాదం సమయంలో కేటీఆర్‌ కారులో ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుంచి మరొక కారులో సభ ప్రాంగణానికి కేటీఆర్ వెళ్లారు. లారీ డ్రైవర్ కూడా తన వాహనాన్ని ఆపి కేటీఆర్ వద్దకు వచ్చినట్టు సమాచాం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

Advertisement

 

Related News

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×