E-Paper
Advertisement

Crime Thriller OTT : పబ్ లో మోడల్ హత్య… ఇంత ఓపెన్ గా మర్డర్ ఏంటి భయ్యా… ఈ క్రైమ్ డ్రామా క్లైమాక్స్ కేక

Crime Thriller OTT : పబ్ లో మోడల్ హత్య… ఇంత ఓపెన్ గా మర్డర్ ఏంటి భయ్యా… ఈ క్రైమ్ డ్రామా క్లైమాక్స్ కేక

Crime Thriller OTT :  క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో ఉన్నాయంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఒక లుక్కేస్తారు మూవీ లవర్స్. అలా భాష అస్సలు అడ్డు గోడే కాదు అనుకునే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీల్ అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2011లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ (No One Killed Jessica). రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ 1999లో జరిగిన జెస్సికా లాల్ మర్డర్ కేసు ఆధారంగా తీసిన ఫిక్షనల్ వెర్షన్. రాణి ముఖర్జీ ఇందులో జర్నలిస్ట్ గా నటించగా, విద్యా బాలన్ సబ్రీనా లాల్ అంటే జెస్సికా సిస్టర్ పాత్రను పోషించింది. జెస్సికా లాల్ గా మైరా కర్న్ నటిస్తే, రాజేష్ శర్మ, నీల్ భూపాలం, సత్యదీప్ మిశ్రా కీ రోల్స్ పోషించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 2 గంటల 16 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీ 2011 జనవరి 7న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టి, సక్సెస్ అయింది. IMDbలో ఈ మూవీకి 7.2 రేటింగ్ ఉందంటేనే మూవీ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్ ఈవెంట్స్ ఆధారంగా తీసిన ఫిల్మ్ కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు మస్ట్ వాచ్.

Read Also :  తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్

స్టోరీలోకి వెళ్తే…

1999లో ఢిల్లీలో జరిగిన జెస్సికా లాల్ మర్డర్ కేసు ఇన్స్పిరేషన్ తో మూవీ సాగుతుంది. జెస్సికా లాల్ (మైరా కర్న్) అనే అమ్మాయి మోడల్ మాత్రమే కాదు బార్ స్టాఫ్ గా కూడా పని చేస్తుంది. ఆ పబ్ లో రిచ్ పర్సన్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. పవర్‌ ఫుల్ పర్సన్ అయిన మను శర్మ (సత్యదీప్ మిశ్రా) జెస్సికాను షూట్ చేసి చంపేస్తాడు. ఈ హటాత్పరిణామానికి అందరూ నివ్వెరపోతారు. కానీ హత్య చేసింది రిచ్ పర్సన్ కాబట్టి, కేసు పెద్దగా బయటకు రాకుండానే క్లోజ్ చేస్తారు. జెస్సికా సిస్టర్ సబ్రీనా లాల్ (విద్యా బాలన్) తన సిస్టర్ మర్డర్ గురించి కేసు కూడా పెడుతుంది. కానీ మను ఫ్యామిలీ పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల విట్నెస్ గా ఉన్నవాళ్ళు ఎవ్వరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రారు. దీంతో చేసేదేం లేక సబ్రీనా నిరాశలో మునిగిపోతుంది.

మరోవైపు మీరా గైటీ (రాణి ముఖర్జీ) అనే జర్నలిస్ట్ ఈ కేసు కోసం రంగంలోకి దిగుతుంది. చనిపోయిన అమ్మాయి కేసు గురించి ఏకంగా స్టోరీ చేస్తుంది. అక్కడితో ఆగకుండా మీడియా క్యాంపెయిన్ షురూ చేస్తుంది. “Justice for Jessica” పేరుతో పబ్లిక్ సపోర్ట్ ను కూడగడుతుంది. మీరా బాస్ (రాజేష్ శర్మ) సపోర్ట్‌ తో ఈ కేసును రీఓపెన్ చేయించడానికి తనకు చేతనైనంత వరకు ప్రయత్నిస్తుంది. మరి పోలీసులు కేసును రీఓపెన్ చేశారా ? జెస్సికాకు న్యాయం జరిగిందా లేదా ? ఆ అమ్మాయికి జస్టిస్ జరగడానికి మీరా, సబ్రీనా ఏం చేశారు? అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×