Shambhala OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు సాయికుమార్(Sai Kumar) వారసుడిగా ఆది సాయికుమార్(Aadi Sai Kumar) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది సాయికుమార్ సినిమాలు ఇటీవల పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని నేపథ్యంలో ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈయన శంభాల (Shambhala)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిస్మస్ బరిలో ఎన్నో సినిమాలు విడుదలకు ఉన్నప్పటికీ శంభాల సినిమా మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
థియేటర్లలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారకంగా తెలియజేశారు.ఈనెల 22 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు ఒకరోజు ముందుగానే ఈ సినిమాని చూసే వెసులు బాటను కల్పిస్తున్నట్టు ఆహా అధికారికంగా తెలియజేసింది. థియేటర్ లో ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ అయిన వారు ఆహాలో ఈ సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఆది సాయికుమార్,అర్చన అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా సైన్స్ మరియు అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..
Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha
(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026
1980వ దశాబ్దంలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైంది. శంభాల అనే పేరుతో 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరిలో ఒకరోజు ఉల్క పడుతుంది. ఈ ఉల్కపడిన సమయం నుంచి ఆ ఊరిలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గ్రామ ప్రజల ప్రవర్తనలో మార్పులు రావడం ఉన్నఫలంగా ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. ఇలా మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతున్న ఈ గ్రామంలోకి విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్త ఆ గ్రామంలో అడుగు పెడతారు. ఇలా ఈ గ్రామంలో జరిగే ఆత్మహత్యల వెనుక కారణాలను విక్రమ్ కనుక్కుంటారా? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ సమస్యకు పరిష్కారాన్ని విక్రమ్ కనుగొన్నారా? అన్నదే ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ శంభాల సినిమా మాత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. థియేటర్లలో సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: Yellama Glimpse: దేవి శ్రీ హీరోగా ఎల్లమ్మ గ్లింప్స్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తుందిగా?