E-Paper
Advertisement

Pumpkin Seeds: గుండెను రక్షించే గుమ్మడి గుంజలు.. రోజూ ఈ విధానంలో తీసుకుంటే ఫుల్ బెనిఫిట్స్!

Pumpkin Seeds: గుండెను రక్షించే గుమ్మడి గుంజలు.. రోజూ ఈ విధానంలో తీసుకుంటే ఫుల్ బెనిఫిట్స్!
Advertisement

Pumpkin Seeds: సహజసిద్ధంగా దొరికే గుమ్మడి గింజలు ఆరోగ్యానికి వరం లాంటిది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, మధుమేహులు రోజూ టీ స్పూన్ గుమ్మడి గింజలు తింటే.. ఎంతటి రోగాలనైనా తట్టుకునే శక్తిని పొందుతారు. మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఈ సీడ్స్‌లో దాగుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్ల కూడా గుమ్మడి గింజలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం:

ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. వాటిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను సజావుగా చేసి.. దీర్ఘకాలిక మలబద్ధకానికి సహజ పరిష్కారం అందిస్తుంది.

Advertisement

Also Read: క్యాన్సర్‌ని ఎదుర్కొనే శక్తి దీనికి ఉందా? పీరియడ్స్ నొప్పులకూ బెస్ట్ సొల్యూషన్ అంటున్న నిపుణులు!

గుండె జబ్బులు దరిచేరవు:

ఈ గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.దీంతోపాటు రక్తపోటును నియంత్రించడంలో గుమ్మడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

ప్రశాంతమైన నిద్ర కోసం..

Advertisement

అంతే కాదు.. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉండటంతో సెరోటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రోజూ స్నాక్‌గా ఓ టీస్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల సుఖవంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.

ఇమ్యూనిటీ బూస్టర్:

గుమ్మడి గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. ఈ సీడ్స్‌లోని పోషకాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తూ, సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన పేగుల ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. ఇది మొత్తం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్లకు చెక్:

ఇకపోతే ఆడవాళ్లలో తరచూ ఏర్పడే యూరినరీ ఇన్ఫెక్షన్లకు గుమ్మడి గింజలు చక్కగా పరిష్కారాన్ని చూపుతాయి. అంతేకాదు.. ఈ గింజల్లో విటమిన్ E ఉండటం వల్ల మూత్రం పోసేటప్పుడు మంట, ఒళ్లు నొప్పులు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

Also Read: డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. వారంలో రెండుసార్లు తలకాయ కూర తింటే జరిగేది ఇదే!

 

 

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×