E-Paper
Advertisement

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్
Advertisement

Malayalam Thriller: మనం ప్రకృతిని కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. అంతేగానీ చెట్లు కొట్టేసి, పొగ, ప్లాస్టిక్ వాడకంతో గాలి, నీరూ, భూమి అన్నీ పొల్యూట్ చేస్తే… దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటితరం వాళ్ళకి బాగా తెలుసు. ప్రకృతిని హింసిస్తే అది ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది ? అనే అద్భుతమైన స్టోరీ లైన్ తో రూపొందిన సినిమానే ‘ఆవాసవ్యూహం’ (Aavasavyuham The Arbit Documentation of An Amphibian Hunt). ప్రకృతి స్వరూపం అయిన వింత మనిషికి సంబంధించిన ఈ కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ పుాతువైపిన్ అనే చిన్న ద్వీపంలో షురూ అవుతుంది. ఒకరోజు ఆ ఊర్లోకి ‘జోయ్’ అనే కొత్త యువకుడు ఎంట్రీ ఇస్తాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడో, అతని గతం ఏంటో అక్కడ ఉన్న ఒక్కరికి కూడా తెలియదు. ఎందుకంటే అతను చాలా మౌనంగా ఉంటాడు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. కానీ అతనికి ప్రకృతితో, జంతువులతో, పక్షులతో ఒక విచిత్రమైన అనుబంధం ఉంటుంది.

Advertisement

పడవ ఎక్కి సముద్రంలోకి వెళ్తే… వేల సంఖ్యలో చేపలు వాటంతట అవే స్వయంగా వలల్లోకి వచ్చి పడతాయి. ఇళ్లలోకి వచ్చే విషపూరితమైన పాములు అతని మాట వింటే చాలు, ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అతని చుట్టూ ఎప్పుడూ దోమలు, ఈగలు ముసురుతూనే ఉంటాయి. వింత ఏంటంటే… అవి అతనిని కుట్టవు. అతని శరీరం నుండి మట్టి, కప్పల వాసన వస్తుంటుంది. అతనికి ఉన్న ఈ శక్తుల వల్ల ఊరి ప్రజలు కొందరు అతనిని భగవంతుడి ప్రతిరూపంగా భావించి పూజిస్తే, మరికొందరు అతనొక చేతబడి చేసే మాంత్రికుడని భయపడతారు.

జోయ్ అమాయకత్వాన్ని, అతని శక్తులను ఊరిలోని స్వార్థపరులు తమ సొంత లాభాల కోసం వాడుకోవాలి అనుకుంటారు. స్థానిక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు తమ వ్యాపారాల కోసం అతడిని ఒక పావుగా వాడుకుంటారు. అదే సమయంలో ఆ ద్వీపంలో ప్రభుత్వం ఒక భారీ గ్యాస్ ప్లాంట్ ను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల అక్కడి పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. ఊరి ప్రజలు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటారు.

Advertisement

ఈ పర్యావరణ పోరాటంలో జోయ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ ద్వీపంలో ఒక అత్యంత అరుదైన, అంతరించిపోతున్న కప్ప జాతిని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. ఆ కప్పను పట్టుకోవడానికి అంతర్జాతీయ పరిశోధకులు, ప్రభుత్వ అధికారులు, స్మగ్లర్లు ఆ ఊరికి వస్తారు. జోయ్ ఆ కప్పలను రక్షించడానికి ప్రయత్నిస్తుంటే, చుట్టూ ఉన్న సమాజం, పోలీసులు అతనిని ఒక నిందితుడిగా, నేరస్థుడిగా చూడటం ప్రారంభిస్తారు. కప్ప వేట కాస్తా చివరికి మనిషి వేటలా మారుతుంది. మరి ఇంతకీ ఆ కప్ప కథ ఏంటి ? హీరోని ఎందుకు వేటాడతారు ? ఫలితంగా క్లైమాక్స్ లో వచ్చే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

కొచ్చి తీరంలోని ఒక చిన్న మత్స్యకార ద్వీపంలో జరిగే ఈ సినిమా కథను, మోక్యుమెంటరీ స్టైల్‌లో తీశారు. ఈ మలయాళ చిత్రం 2022లో విడుదలై కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. SonyLIVలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. పర్యావరణం, సమాజం గురించి ఆలోచింపజేసే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×