E-Paper
Advertisement

నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ

నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ
Advertisement

Romantic Movie : అభిలాషం.. ఒక చిన్న ఆశ.. ఒక చిన్న హృదయ స్పర్శ..! ఇది రొమాంటిక్‌ డ్రామా! ప్రేమకథలకు మలయాళ చిత్ర పరిశ్రమ పెట్టింది పేరు. మనుషుల మధ్య ఉండే సహజమైన భావోద్వేగాలను, బంధాలను వెండితెరపై ఆవిష్కరించడంలో మాలీవుడ్ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. అదే కోవలో 2025లో విడుదలై, ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న సరికొత్త రొమాంటిక్ డ్రామా ‘అభిలాషమ్’. సాయిజు కురుప్, తన్వి రామ్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక లవ్ ఫెయిల్యూర్‌ స్టోరీ.. జీవితం ఇచ్చే రెండో అవకాశం చుట్టూ తిరిగే ఒక అందమైన ఎమోషనల్ జర్నీ.

మనసుకు హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ:

కేరళలోని మలప్పురం జిల్లా ‘కొట్టక్కల్’ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కథ సాగుతుంది. కథానాయకుడు అభిలాష్ అక్కడ ఒక సాంప్రదాయ ‘అత్తర్’ దుకాణాన్ని నడుపుతుంటాడు. చిన్నప్పటి నుంచి అతనికి తన స్నేహితురాలు షెరిన్ అంటే ప్రాణం. అయితే తన ప్రేమను ఆమెకు చెప్పలేకపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి షెరిన్‌కు వేరే వ్యక్తితో పెళ్లి జరిగి ఆమె ఊరు వదిలి వెళ్ళిపోతుంది. సంవత్సరాల తర్వాత, కొన్ని కారణాల వల్ల షెరిన్ తన భర్త నుంచి విడిపోతుంది. ఒక ఒంటరి తల్లిగా తిరిగి తన సొంత ఊరికి వస్తుంది. అభిలాష్ మనస్సులో ఆమెపై ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది. షెరిన్ పడుతున్న బాధలను చూసి, ఆమె జీవితంలోకి మళ్ళీ సంతోషాన్ని తీసుకురావాలని అభిలాష్ తపిస్తాడు. తన చిన్ననాటి ప్రేమకు సెకండ్‌ ఛాన్స్ ఇవ్వాలని, ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

అయితే, సమాజం నుంచి ఎదురయ్యే అభ్యంతరాలు, షెరిన్ మనసులోని పాత గాయాలు వీరిద్దరి మధ్య అడ్డుగోడగా నిలుస్తాయి. కథ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఇటు షెరిన్ మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. అభిలాష్ ప్రేమని అంగీకరించడానికి బదులు, తమ మధ్య ఉన్న పవిత్రమైన స్నేహానికే ఆమ ఇంపార్టెన్స్‌ ఇస్తుంది.

ఇక పాతకాలపు జ్ఞాపకాలను, మలప్పురం సంస్కృతిని దర్శకుడు షామ్‌జు జేబా చాలా అందంగా తెరకెక్కించారు. సాయిజు కురుప్ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. తన్వి రామ్ ఒంటరి తల్లి పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలను పలికించింది. కేరళ పల్లెటూరి అందాలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్.. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×