E-Paper
Advertisement

సర్వస్వం కోల్పోయిన మనిషిని గెలికితే ఇదే గతి… బ్లడీ బ్లడ్ బాత్

సర్వస్వం కోల్పోయిన మనిషిని గెలికితే ఇదే గతి… బ్లడీ బ్లడ్ బాత్
Advertisement

Action Drama : మార్వెల్ యూనివర్స్‌లో ఇంత బ్రూటల్ యాక్షన్ మూవీనా ?- రక్తంతో మొదలైన ప్రయాణం. బుల్లెట్లతో నిండిన జీవితం. ప్రతీకారంతో మండిపోయిన మనసు. కానీ ఒక రోజు శత్రువులంతా ముగిసిపోయిన తర్వాత కూడా మనసులోని యుద్ధం మాత్రం ఆగకపోతే? అదే ప్రశ్న చుట్టూ తిరిగే కథే మార్వెల్ టెలివిజన్ తీసుకొచ్చిన ‘ది పనిషర్: వన్‌ లాస్ట్’. 2026 may 12 నుంచి ఇది జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.

యాక్షన్ మాత్రమే కాదు.. సైకాలజీ కూడా:

జాన్ బెర్న్‌థాల్ మరోసారి ఫ్రాంక్ కాజిల్ పాత్రలో కనిపించిన ఈ స్పెషల్‌కు రీనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహించాడు. సుమారు 50 నిమిషాల నిడివి ఉన్న ఈ మార్వెల్ స్పెషల్ ప్రస్తుతం డిస్నీ ప్లస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా.. ఒక పాత్ర మానసికంగా ఎలా విరిగిపోతుందో చూడాలనుకునే వారికి కూడా ఈ కథ స్పెషల్ ఎక్స్‌పిరియన్స్‌ను తీసుకొస్తుంది. తన భార్య, కూతురు హత్యతో జీవితాన్ని కోల్పోయిన ఫ్రాంక్ కాజిల్ సంవత్సరాల పాటు నేర ప్రపంచంపై యుద్ధం చేస్తూ వచ్చాడు. తన కుటుంబ మరణానికి కారణమైన వారందరినీ ఒక్కొక్కరిని అంతం చేశాడు. చివరకు గ్నుచ్చి క్రైమ్ ఫ్యామిలీని కూడా పూర్తిగా నాశనం చేసిన తర్వాత తన పగ తీరిపోయిందని భావిస్తాడు. ఇక సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

పనిషర్ రూపాన్ని పక్కన పెట్టి న్యూయార్క్‌లోని లిటిల్ సిసిలీ ప్రాంతంలో ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. అయితే బయట యుద్ధం ముగిసినా, లోపల యుద్ధం మొదలవుతుంది. చనిపోయిన భార్య, కూతురు, యుద్ధంలో కోల్పోయిన సహచరులు అతనికి హాల్యూసినేషన్స్ రూపంలో కనిపిస్తుంటారు. ప్రతి రాత్రి గతం అతన్ని వెంటాడుతుంది. తీవ్ర మానసిక వేదన, ఒంటరితనం, ఉద్దేశ్యం లేని జీవితం అతన్ని పూర్తిగా కుంగదీస్తాయి.

అలాంటి సమయంలో గ్నుచ్చి కుటుంబానికి చెందిన మా గ్నుచ్చి రంగంలోకి దిగుతుంది. జూడిత్ లైట్ పోషించిన ఈ పాత్ర క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తన కుటుంబాన్ని నాశనం చేసిన ఫ్రాంక్ పై ఆమె భారీ బౌంటీ ప్రకటిస్తుంది. ఒక్కసారిగా లిటిల్ సిసిలీ ప్రాంతం యుద్ధభూమిగా మారిపోతుంది. గ్యాంగ్ స్టర్లు, కిరాయి హంతకులు, నేరగాళ్లు అందరూ ఫ్రాంక్ వేటలో పడతారు.

ఎండింగ్‌లో థ్రిల్‌ మాములుగా ఉండదుగా:

Advertisement

ఇక చివరిలో వచ్చే బ్రూటల్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. అదే సమయంలో ప్రతీకారం, పాపభీతి, విముక్తి లాంటి భావోద్వేగాలను కూడా లోతుగా చూపిస్తాయి. అందుకే ఈ స్పెషల్ కేవలం తుపాకులు పేలే యాక్షన్ కథలా కాకుండా పగతో బతికిన ఒక మనిషి, పగ ముగిసిన తర్వాత తన జీవితానికి అర్థం వెతికే భావోద్వేగ ప్రయాణం. జాన్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పనిషర్ ప్రదర్శనగా ఇది నిలిచిపోతుంది.

Read Also : ‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×