Action Thriller OTT : పక్కా హైటెన్షన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనిపిస్తుందా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి. ఇది మొదలైన కొద్దిసేపటికే మెయిన్ పాయింట్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నిలవకుండా కథ పరుగులు తీస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని అవినీతి, సామాన్యుల పట్ల వాళ్ళ అరాచకాలు, జాతి వివక్ష వంటి సీరియస్ అంశాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. గన్ ఫైట్స్, ఛేజింగ్ సీన్లు, ప్రాణాలను కాపాడుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లాక్ అండ్ బ్లూ’ (Black and Blue). దీనికి డియోన్ టేలర్ దర్శకత్వం వహించారు. ఇందులో నవోమి హారిస్, టైరీస్ గిబ్సన్, ఫ్రాంక్ గ్రిల్లో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం వాడిన టెక్నాలజీ చాలా ప్రత్యేకం. బాడీ క్యామ్ విజువల్స్ సహజంగా రావడం కోసం అత్యాధునిక Sony కెమెరాలతో పాటు, కొన్ని సీన్లను Sony Xperia 1 స్మార్ట్‌ఫోన్లను వాడి చిత్రీకరించారు. అలాగే హీరోయిన్ నవోమి హారిస్ ఈ పాత్ర కోసం తన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. ఎందుకంటే సినిమాలో ఆమె చేసే ఫైట్ సీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సినిమా సుమారు $12 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా $22 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదట ఈ సినిమాకు ‘ఎక్స్‌పోజర్’ (Exposure) అనే పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ‘బ్లాక్ అండ్ బ్లూ’గా మార్చారు. ఇక్కడ ‘బ్లాక్’ అంటే ఆమె నల్లజాతీయురాలు అని, ‘బ్లూ’ అంటే ఆమె వేసుకునే పోలీస్ యూనిఫామ్ అని అర్థం వచ్చేలా టైటిల్ పెట్టారు. ఈ సినిమా Google Play Movies, Apple TVలో అద్దెకు అందుబాటులో ఉంది.
అలిసియా వెస్ట్ అనే అమ్మాయి కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరుతుంది. ఒకరోజు ఆమె డ్యూటీలో ఉండగా ఒక దారుణం జరుగుతుంది. తన సొంత డిపార్ట్‌మెంట్‌లోని కొందరు అవినీతి పోలీసులు, ఒక అమాయకపు కుర్రాణ్ణి దారుణంగా లేపేయడం కళ్లారా చూస్తుంది. ఆ సీన్ మొత్తం ఆమె డ్రెస్సుకున్న బాడీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. ఇంకేముంది ఆ వీడియో గాని బయటకు వస్తే తమ పని ఐపోతుందని ఆ పోలీసులు ఈమె మీద పడతారు.
వాళ్ళు తెలివిగా ఊర్లో ఉన్న గ్యాంగ్‌స్టర్లకు అబద్దాలు చెప్పి, ఆమె మీదకు ఉసిగొల్పుతారు. అటు పోలీసులు, ఇటు రౌడీలు.. అందరూ కలిసి ఆమెను వేటాడటం మొదలుపెడతారు. పాపం ఆమెకు ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు. అప్పుడు మౌస్ అనే ఒక పాత పరిచయస్తుడి సాయం తీసుకుంటుంది. చివరికి ఆ దొంగ పోలీసుల అసలు రంగు బయటపెట్టడానికి ఆమె పడే పాట్లు మామూలుగా ఉండవు. తనని చంపాలనుకున్న వాళ్లనే బురిడీ కొట్టించి, ఆ కెమెరాలోని వీడియోని ఎలా అప్‌లోడ్ చేసింది ? వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పింది ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.
Read Also : ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ