E-Paper
Advertisement

Action Comedy OTT: దోపిడీ దొంగలకు షాక్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి… ఆకట్టుకుంటున్న యాక్షన్ కామెడి

Action Comedy OTT: దోపిడీ దొంగలకు షాక్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి… ఆకట్టుకుంటున్న యాక్షన్ కామెడి
Advertisement

Action Comedy OTT : గత ఏడాది వచ్చిన ఒక యాక్షన్ కామెడీ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా థియేటర్లలో కూడా పాజిటివ్ టాక్ తో నడిచింది. కథలో బ్యాంక్ లో పని చేసే ఒక ఉద్యోగి, తన ప్రియురాలు కిడ్నాప్‌కు గురైనప్పుడు ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఆసక్తిగా సాగిపోతుంది. ఈ యాక్షన్ కామెడీ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘నొవొకైన్’ (Novocaine). డాన్ బర్క్, రాబర్ట్ ఓల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జాక్ క్వాయిడ్ ఇందులో హీరోగా నటించగా, అంబర్ మిడ్‌థండర్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం 2025 మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నాథన్ కైన్ ఒక బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే చాలా సాధారణమైన వ్యక్తి. కానీ అతనికి ఒక వింత సమస్య ఉంటుంది. తన శరీరానికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా, అసలు నొప్పే తెలియదు. దీని వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు కూడా పడతాడు. ఒకరోజు క్రిస్మస్ ఈవ్ రోజు అతను పని చేసే బ్యాంకుపై కొందరు దొంగలు దోపిడీ చేస్తారు. ఆ గందరగోళంలో నాథన్ ఇష్టపడే అమ్మాయి షెర్రీని ఆ దొంగలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. తన ప్రేయసిని కాపాడుకోవడానికి ఏ మాత్రం ఫైటింగ్ స్కిల్స్ తెలియని నాథన్, ఒంటరిగా వాళ్ళను వెంబడించడం మొదలుపెడతాడు. గన్ చేసింగ్ తో స్టోరీ పీక్స్ కి వెళ్తుంది.

అయితే ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే అతిపెద్ద బలం తనకున్న నొప్పి తెలియని లక్షణమే. శత్రువులు తనను ఎంత కొట్టినా, గాయపరిచినా ఆ నొప్పిని పట్టించుకోకుండా నాథన్ ఒక మొండి పోరాటం చేస్తాడు. ఏ కష్టమొచ్చినా వెనక్కి తగ్గకుండా, తన లోపాన్నే ఒక ఆయుధంగా మార్చుకుని ఆ కిరాతక ముఠా నుండి షెర్రీని ఎలా రక్షించాడు అనేదే ఈ సినిమాలోని అసలు ట్విస్ట్.

Advertisement

Read Also :  ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×