E-Paper
Advertisement

Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు, స్పాట్‌లో 30 మంది మృతి

Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు, స్పాట్‌లో 30 మంది మృతి
Advertisement

Road Accident: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇంతకీ ట్రక్కులో ప్రజలు ప్రయాణించడం ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 

Advertisement

ఉత్తర నైజీరియాలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. కానో రాష్ట్రంలోని క్వానార్ బార్డే పట్టణంలోని హైవేపై ఈ ఘటన జరిగింది. పెద్ద ట్రైలర్ అయిన వాహనం అధిక వేగంతో ప్రయాణిస్తోంది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గురైన ట్రక్కు కానో నుండి గుజుంగు పట్టణం వైపు ప్రయాణికులను, వస్తువులను రవాణా చేస్తోంది. ఘటన సమయంలో ట్రక్కులో దాదాపు 50 మంది ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో అనేకమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన బాధితులను చికిత్స కోసం సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

అదుపు తప్పిన ట్రక్కు, స్పాట్‌లో 30 మంది మృతి

రోడ్డు ప్రమాదం ఘటనపై కానో గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పేర్కొంది. ఈ సంఘటన హృదయ విదారకమైనదిగా తెలిపారు. బాధిత కుటుంబాలకే కాకుండా కానో రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర నష్టం కలిగించిందని గవర్నర్ అభివర్ణించినట్టు అందులో పేర్కొంది.

డిసెంబర్‌లో లాగోస్-ఇబాడాన్ ఎక్స్‌ప్రెస్‌వేపై బ్రిటీష్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ జాషువా వాహనాన్ని ట్రక్ను ఢీకొట్టడంతో గాయపడ్డాడు. అతడి ఇద్దరు సన్నిహితులు మరణించారు. డ్రైవర్ వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తేల్చారు.

ALSO READ: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం

నార్మల్‌గా ఆఫ్రికాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు రోడ్లు సరిగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నారు. దీనికితోడు ట్రాఫిక్ చట్టాలను అమలు చేయకపోవడం కూడా మరొక కారణంగా చెబుతోంది.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×