E-Paper
Advertisement

హైజాకర్లకి సీన్ సితారే.. ఆ ఇల్లాలి దెబ్బకి ఉగ్రవాదుల గుండెలు హడల్

హైజాకర్లకి సీన్ సితారే.. ఆ ఇల్లాలి దెబ్బకి ఉగ్రవాదుల గుండెలు హడల్
Advertisement

Action Comedy OTT : ఓటీటీలో ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేది కొన్ని సినిమాలే. ఇక వీటిలో యాక్షన్ కామెడీ కంటెంట్ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ జానర్ లో వచ్చిన ఒక కొరియన్ మూవీ చాలా క్రేజీగా ఉంటుంది. ఈ సినిమా నిడివి సుమారు 100 నిమిషాలు ఉండగా, అస్సలు ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కే ఒక ఫ్యామిలీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వాళ్ళు ప్రయాణిస్తున్న విమానాన్ని కొంతమంది ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. దీంతో అసలు కథ చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియా యాక్షన్ కామెడీ సినిమా పేరు ‘ఓకే! మేడమ్’ (Okay! Madam). ఇందులో ఉమ్ జంగ్-హ్వా (మి-యంగ్), పార్క్ సుంగ్-వూంగ్ (సియోక్-హ్వాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ ఉమ్ జంగ్-హ్వా ఒకప్పుడు పాప్ సింగర్‌గా కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలో ఆమె కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు $9.4 మిలియన్ల (సుమారు ₹78 కోట్లు) వసూళ్లను సాధించింది. ఇది 2020లో విడుదలైన విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. IMDb లో ఈ సినిమాకు 6.7/10 రేటింగ్ కూడా ఉంది. లీ చోల్-హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సనాయ్ పిక్చర్స్ దీనిని నిర్మించింది. ఈ సినిమా ప్రస్తుతం Netflix, Amazon Prime Video, Viki వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మి-యంగ్ ఒక మార్కెట్‌లో స్వీట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఆమె భర్త సియోక్ కంప్యూటర్ రిపేర్లు చేస్తుంటాడు. ఈ మధ్యతరగతి దంపతులు తమ జీవితంలో ఎప్పుడూ విదేశీ ప్రయాణం చేసి ఉండరు. అయితే ఒకసారి వీళ్ళకి లక్కీ డ్రాలో హవాయి వెళ్లే అవకాశం వస్తుంది. తమ చిన్న కూతురితో కలిసి సంతోషంగా విమానం ఎక్కుతారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. వీళ్ళు ప్రయాణిస్తున్న విమానాన్ని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. విమానంలోనే దాక్కున్న ఒక సీక్రెట్ ఏజెంట్ కోసం వాళ్ళు వెతుకుతుంటారు. ప్రయాణీకులందరూ ప్రాణభయంతో వణికిపోతుంటే, విమానం మొత్తం టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్తుంది. ఈ గందరగోళంలో మి-యంగ్ కుటుంబం కూడా చిక్కుకుపోతుంది.

కానీ అసలు విషయం ఏమిటంటే.. మి-యంగ్ కేవలం మామూలు గృహిణి మాత్రమే కాదు, ఆమె గతంలో ఒక కఠిన శిక్షణ తీసుకున్న సీక్రెట్ ఏజెంట్. ఇప్పుడు తన కుటుంబాన్ని, తోటి ప్రయాణీకులను కాపాడుకోవడానికి ఆమె తన టాలెంట్ ను బయటకి తీస్తుంది. చివరికి ఉగ్రవాదులను ఆమె ఎలా మట్టికరిపించింది ? తన ఫ్యామిలీని, ప్రయాణికులను ఎలా కాపాడింది ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది.

Advertisement

Read Also : డబ్బున్న వాడా? మనసున్న వాడా? అంతస్తుల మధ్య చిక్కుకున్న అందమైన ప్రేమ కథ

Tags

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×