Romantic Comedy Drama : ఓటీటీలో ఒక రొమాంటిక్ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా న్యూయార్క్ నగరంలోని ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ మేకర్ అయిన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన క్లయింట్‌లలో ఒక ధనవంతుడిని, డబ్బు లేని తన పాత ప్రియుడు మధ్య ఎవరిని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఒకప్పుడు నిజంగానే న్యూయార్క్‌లో ‘మ్యాచ్ మేకర్’ (పెళ్లిళ్ల సంబంధాలు చూసే వ్యక్తి) గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె చూసిన మనుషులు, వాళ్ళ మనస్తత్వాల ఆధారంగానే ఈ కథను రాసుకున్నారు. ఇక ఈ సినిమాను పాత కాలపు పద్ధతిలో 35mm ఫిలిం మీద షూట్ చేశారు. దీనివల్ల సినిమా విజువల్స్ చాలా నేచురల్‌గా, కనిపిస్తాయి. అంతేకాకుండా న్యూయార్క్ నగరాన్ని చాలా అందంగా చూపించారు ఇందులో.
ఈ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘మెటీరియలిస్ట్స్’ (Materialists). 2025లో వచ్చిన ఈ సినిమాకు సెలైన్ సాంగ్ డైరెక్ట్ చేశారు. ఈమె అంతకుముందు తీసిన ‘పాస్ట్ లైవ్స్’ (Past Lives) సినిమాకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. అందుకే ఈ సినిమాపై హాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఇందులో ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ఫేమ్ డకోటా జాన్సన్, మనందరికీ తెలిసిన ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ పెడ్రో పాస్కల్ వంటి నటులు ఉన్నారు. ఈ సినిమాను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ A24 నిర్మించింది. వీళ్లు ఎప్పుడూ వెరైటీ కథలనే ఎంచుకుంటారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఈ చిత్రం 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను Netflix, Prime Video ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు. ఇది తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.
లూసీ (డకోటా జాన్సన్) అనే అమ్మాయి న్యూయార్క్ నగరంలో ఒక పెద్ద ప్రొఫెషనల్ మ్యాచ్ మేకర్. అంటే బాగా డబ్బున్నోళ్లకు సెట్ అయ్యే సంబంధాలు వెతికి పెట్టడం ఈమె పని. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, పక్కనోళ్ల పెళ్లిళ్లు చేసే ఈమెకు, తన లైఫ్ మాత్రం ఎప్పుడూ అయోమయంగానే ఉంటుంది. ప్రేమ కంటే కూడా డబ్బు, స్టేటస్ ముఖ్యం అని నమ్మే రకం ఈమె. అందుకే ఈమెను అందరూ ‘మెటీరియలిస్ట్’ (డబ్బు పిచ్చిది) అని పిలుస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో ఈమె లైఫ్‌లోకి ఇద్దరు మగాళ్లు వస్తారు. ఒకడేమో హ్యారీ (పెడ్రో పాస్కల్) – వీడు మామూలోడు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంటుంది, లుక్ కూడా అదిరిపోతాడు. ఈమెకు కావాల్సిన లగ్జరీ లైఫ్ వీడితో గ్యారంటీ.
ఇంకోడేమో జాన్ (క్రిస్ ఎవాన్స్) – వీడు ఈమె పాత ప్రియుడు. ఇప్పుడు తిండికి కూడా తిప్పలు పడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు. కానీ వీడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం లూసీకి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. డబ్బున్న వాడితో వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, కానీ మనశ్శాంతి ఉండదు. పోనీ పాత ప్రియుడి దగ్గరికి వెళ్దామంటే జేబు ఖాళీగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతూ, చివరికి ఆ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుంది? ఎలాంటి లైఫ్ కు ఓటేసింది ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.
Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా