E-Paper
Advertisement

Action Comedy OTT: తుప్పు పట్టిన కత్తులతో కాలక్షేపం … కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ మిషన్… దుమ్ము లేపే ఫైట్స్

Action Comedy OTT: తుప్పు పట్టిన కత్తులతో కాలక్షేపం … కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ మిషన్… దుమ్ము లేపే ఫైట్స్
Advertisement

Action Comedy OTT : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. నచ్చిన కంటెంట్ దొరికిన సమయంలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీటిలో యాక్షన్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ముఖ్యంగా జపనీస్, కొరియన్ సినిమాలను అస్సలు వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలో ఒక జపనీస్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. యాక్షన్ తో పాటు కామెడీ సీన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి కూడా. మరి ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళ్దాం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ జపనీస్ యాక్షన్ కామిడీ మూవీ పేరు ‘అండర్ నింజా’ (Under Ninja). ఈ సినిమా 2025 జనవరి 24న జపాన్‌లో విడుదలైంది. కేంగో హనజావా రాసిన ప్రజాదరణ పొందిన మాంగా నవల ఆధారంగా ఇది తెరకెక్కింది. కామెడీ సినిమాలకు పేరుగాంచిన యుచి ఫుకుడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టాలెంటెడ్ యాక్టర్ కెంటో యమజాకి కథానాయకుడిగా నటించగా, మినామి హమాబే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను ప్రముఖ జపనీస్ మ్యూజిక్ గ్రూప్ ‘క్రీపీ నట్స్’ అందించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

ఈ కథ చాలా ఆసక్తికరంగా, కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రస్తుత జపాన్‌లో కూడా సుమారు రెండు లక్షల మంది నింజాలు సామాన్యుల్లా బతుకుతుంటారు. హీరో కురో కుమోగాకురే ఒక నిరుద్యోగిలా, ఏ పనీ లేని సోమరిపోతులా కనిపిస్తాడు ఇందులో. కానీ నిజానికి అతను ఒక నింజా. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్న అతనికి, ఉన్నట్టుండి ఒక పెద్ద మిషన్ అప్పగిస్తారు. అదేమిటంటే ఒక హైస్కూల్‌లోకి స్టూడెంట్‌లా వెళ్లి అక్కడ దాక్కున్న శత్రువుల గురించి సమాచారం సేకరించడం.
ఈ క్రమంలో కురో ఆ స్కూల్‌లో అడుగుపెట్టాక కథ స్పీడ్ అందుకుంటుంది.

అక్కడ ఒక వైపు మామూలు స్టూడెంట్ లైఫ్ గడుపుతూనే, మరోవైపు శత్రువుల కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటాడు. అసలు ఆ స్కూల్‌లో ఏం జరుగుతోంది? కురో తన అసలు రూపాన్ని బయటపడనీయకుండా శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్. సీరియస్ యాక్షన్‌తో పాటు డైరెక్టర్ యుచి ఫుకుడా మార్కు కామెడీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుంది.

Advertisement

Read Also :  పిచ్చి ప్రేమతో పెళ్లి వరకు… విడాకులతో ఊహించని మలుపు… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×