Shahid Afridi : టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament ) పాకిస్తాన్ ( Pakistan) దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. సూపర్ 8 స్టేజ్ దాకా వచ్చిన పాకిస్తాన్, సెమీ ఫైనల్ ఛాన్స్ ను కోల్పోయింది. దీంతో ఇంటిదారి పట్టిన పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board). టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ స్టేజిలో ఇండియా చేతిలో ఓడిపోయినందుకుగాను ఫైన్ కట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టార్చర్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో ప్లేయర్ 50 లక్షల రూపాయలు ( ఇండియన్ కరెన్సీలో రూ.16 లక్షలు) బోర్డుకు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే జట్టు నుంచి తొలగిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుండ బద్దలు కొట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
PCB బోర్డుకు 50 లక్షల రూపాయలు పాకిస్తాన్ ప్లేయర్లు కట్టాల్సిందేనని మొహ్సీన్ నఖ్వీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) రియాక్ట్ అయ్యారు. అసలు ప్లేయర్లు 50 లక్షలు కట్టడం ఎక్కడైనా ఉందా? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ నఖ్వీకి బుర్ర పనిచేస్తుందా ? అని ఫైర్ అయ్యారు. కొత్త రూల్స్ తీసుకువచ్చి పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. 50 లక్షలు రూపాయల కోసం పాకిస్తాన్ ప్లేయర్లు ఎక్కడికి వెళ్లాలి? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూ.50 లక్షలు అనేది తప్పుడు నిర్ణయామని.. సరిగ్గా ఆడని ప్లేయర్ పై యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ఒక్కో ప్లేయర్ పై రెండు సంవత్సరాల పాటు వేటు వేయాలని వెల్లడించాడు. అప్పుడే పాకిస్తాన్ ప్లేయర్లు సరైన రూట్ లోకి వస్తారని పేర్కొన్నాడు.
ఇలా అడ్డదిడ్డంగా ఫైన్లు వేస్తామంటే అస్సలు కుదరదని వార్నింగ్ ఇచ్చాడు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ). ఎవరైతే సరిగ్గా ప్రదర్శన కనబరచలేదు వాళ్లపై వేటువేయాలని తెలిపారు. సరైన ప్రదర్శన చేయని ప్లేయర్ లందరినీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు పంపించాలని కోరాడు. అక్కడ అద్భుతంగా రాణించిన ప్లేయర్లను మాత్రమే జట్టులోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అప్పటి వరకు వాళ్లను ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు మాత్రమే పరిమితం చేయాలని వెల్లడించారు. రెండు సంవత్సరాలు అయినా పర్వాలేదు… వాళ్లను క్షమించకూడదని ఫైర్ అయ్యారు. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ స్టేజిలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది.
Shahid Afridi said, "This is a decision that’s hard to understand. It’s small thinking. What will you even do with 50 lakhs? Some players shouldn’t be in the team for at least two years. That’s enough."
pic.twitter.com/fVsd9KtHbL— Sheri. (@CallMeSheri1_) March 3, 2026