E-Paper
Advertisement

Romantic movie OTT: పిచ్చి ప్రేమతో పెళ్లి వరకు… విడాకులతో ఊహించని మలుపు… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ

Romantic movie OTT: పిచ్చి ప్రేమతో పెళ్లి వరకు… విడాకులతో ఊహించని మలుపు… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ
Advertisement

Romantic movie OTT : భార్యాభర్తల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చప్పుకోబోయే సినిమా జీనితాన్ని చాలా దగ్గరగా చూపిస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా సహజంగా, మనసుని హత్తుకునేలా తెరకెక్కించారు. ఒక జంట ప్రేమలో పడిన కొత్తలో ఎంత ఆనందంగా ఉంటారో, అదే ఆరేళ్ల తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం ఎలా విచ్ఛిన్నమైందనేది ఈ సినిమా చాలా ఎమోషనల్ గా చూపిస్తుంది. ఈ సినిమా నటి మిషెల్ విలియమ్స్ ఆస్కార్ (Best Actress) కు నామినేషన్ కూడా పొందారు. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డెరెక్ సియాన్‌ఫ్రాన్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం పేరు ‘బ్లూ వాలెంటైన్’ (Blue Valentine). ర్యాన్ గోస్లింగ్, మిషెల్ విలియమ్స్ ఇందులో భార్యా, భర్తలుగా అద్భుతమైన నటనను కనబరిచారు. 2010లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కూడా. అంతేకాకుండా విలియమ్స్ ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు, ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రెండింటికీ నామినేట్ చేయబడింది. గ్రిజ్లీ బేర్ అందించిన సంగీతం సినిమాలో బాగా ఎలివేట్ చేసింది. ఇక మరో విషయం ఏమిటంటే నటీనటుల మధ్య కెమిస్ట్రీ సహజంగా ఉండటం కోసం, వాళ్ళిద్దరూ షూటింగ్ సమయంలో కొన్ని రోజులు నిజంగానే ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డీన్ (ర్యాన్ గోస్లింగ్), సిండి (మిషెల్ విలియమ్స్) అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమ,పెళ్లి గొడవలే ఈ సినిమా. వీళ్లిద్దరూ ఫస్ట్‌ టైమ్ కలిసినప్పుడు ఎంతో సరదాగా ఉండేవాళ్ళు. డీన్ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ సిండిని ఎలా ఇంప్రెస్ చేశాడు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా మొదలైంది అనేది చాలా క్యూట్‌గా ఉంటుంది. సిండి అప్పటికే ప్రెగ్నెంట్ అని తెలిసినా డీన్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు కూడా. పెళ్లయి ఆరేళ్లు గడిచాక.. అదే డీన్, సిండి మధ్య ఇప్పుడు అస్సలు పడదు. డీన్‌కి ఎదగాలనే ఆశ ఉండదు, సిండికేమో ఇంట్లో బాధ్యతలు, డీన్ ప్రవర్తనతో విసుగు వచ్చేస్తుంది.

వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే, కనీసం మాట్లాడుకోవడానికి కూడా ప్రశాంతత ఉండదు. ఒక రోజు తమ మ్యారేజ్‌ని ఎలాగైనా కాపాడుకోవాలని ఒక హోటల్ రూమ్‌కి వెళ్తారు. కానీ అక్కడ కూడా వాళ్ళ మధ్య పాత కోపాలు, అసహనం బయటపడతాయి. ఒకప్పుడు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లే, ఇప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి పడనంతగా ఎందుకు మారిపోయారు ? గొడవలతో విసిగిపోయిన సిండి చివరకు విడిపోవాలని నిర్ణయించుకుంటుందా ? ఈ సినిమా క్లైమాక్స్ ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also :  రాత్రయితే భార్యతో సైకోలా మారే భర్త … పని మనిషితో రెచ్చిపోయి… మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×