E-Paper
Advertisement

Action Horror Film OTT : అడవిలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి అడ్డంగా బుక్… అథ్లెట్ ను ఆడుకునే నరమాంస భక్షకులు… గూస్ బంప్స్ తెప్పించే సీన్లు

Action Horror Film OTT : అడవిలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి అడ్డంగా బుక్… అథ్లెట్ ను ఆడుకునే నరమాంస భక్షకులు… గూస్ బంప్స్ తెప్పించే సీన్లు
Advertisement

Action Horror Film OTT : ఓటీటీలో యాక్షన్, హారర్ థీమ్స్ తో ఓ మూవీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇందులో మార్సియా అనే మాజీ క్రీడాకారిణి, ఒక ప్రమాదకరమైన నరమాంస భక్షకుల చేతిలో చిక్కుకుంటుంది. ఆమె అక్కడి నుంచి ఎలా బయట పడిందనేదే ఈ కథ. ఇది జర్మనీలోని పురాతన కోటలు, గనుల నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా కట్టి పడేస్తోంది. యాక్షన్ సీన్స్ కు పేరుగాంచిన జూలియా డోర్డెల్ ఇందులో నటించారు. ఈ యాక్షన్ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024లో వచ్చిన ఈ జర్మన్ యాక్షన్ హారర్ మూవీ పేరు ‘ది బిట్టర్ టేస్ట్’ (The Bitter Taste). గైడో టోల్కే దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో మార్సియా పాత్రలో జూలియా డోర్డెల్ నటించారు. ఈమె నిజ జీవితంలో కూడా మాజీ పెంటాథ్లెట్ కావడం విశేషం. ఇక ఈ సినిమా 2024 నవంబర్ లండన్‌లోని ‘ఫ్రైట్‌ఫెస్ట్’ సినీ వేడుకల్లో ప్రీమియర్ అయింది. 2025 జూన్ 5న జర్మనీలోని థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం prime video, Tubi ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మార్సియా ఒక మాజీ పెంటాథ్లెట్ (క్రీడాకారిణి). ఆమె ఒకరోజు అనుకోకుండా, ఒక నరమాంస భక్షక ముఠా చేతిలో బందీగా చిక్కుకుంటుంది. ఈ ముఠా ఆమెను ఒక అడవిలో విడిచిపెట్టి, వినోదం కోసం ఆమెను వేటాడటం మొదలు పెడుతుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి మార్సియా, ఆ ప్రాంతంలో ఉండే ఒక స్థానిక జైలు అధికారి, ఒక జాలరి సహాయంతో తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది.

ఈ నరమాంస భక్షక మనుషుల వేట నుండి తప్పించుకోవడానికి, మార్సియా తన పాత అథ్లెట్ స్కిల్స్ ని ఉపయోగిస్తుంది.  ఇప్పుడు ఆమె కేవలం తన ప్రాణాల కోసమే కాకుండా, ఆ ప్రాంతంలోని రహస్యాలను ఛేదించడానికి కూడా ప్రయత్నిస్తుంది. అసలు ఆ నరమాంస భక్షకులు ఎవరు ? ఎందుకు మార్సియాను వేటాడుతున్నారు ? ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది ? అనే విషయాలను ఈ యాక్షన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఈ బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×