E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన అవని.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన అవని.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి మా డాడీ ని బయటకు తీసుకురావడానికి నేను వేసిన అస్త్రం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.. అని లోపల దొంగ చాటుగా వింటూ మురిసిపోతూ ఉంటుంది.. శ్రియ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను పట్టుకోవడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా కడుపు పోయేది శ్రీ.. మనము ఇంట్లో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం.. మన బిడ్డ కోసమైనా మనం బయటకు వెళ్లి బ్రతుకుదామని అంటుంది. కానీ శ్రీకర్ మాత్రం నేను మా నాన్నకి మాట ఇచ్చాను. మా అన్నయ్యతో కలిసి బిజినెస్ ప్రారంభించాము ఇప్పుడు బయటకు వెళ్లడం కుదరదు అని అంటాడు. మానాన్నే మీ నాన్న అన్న విషయం నాకు తెలుసు అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది. నువ్వు నా తోడికోడలివి అని అనుకుంటేనే సహించలేను. అలాంటిది నువ్వు నాకు అక్క అవుతావు అంటే ఎలా భరిస్తానని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది.. పల్లవికి అవని సొంత అన్న విషయాన్ని చెప్తుంది.. అంతేకాదు అవనిని దారుణంగా అవమానిస్తుంది.. నీకు ఇకమీదట చుక్కలు చూపిస్తానని పల్లవి అంటుంది. కానీ అవని మాత్రం నీ పప్పులు నా దగ్గర ఉడకపు అంటూ పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటికి లాయర్ వస్తాడు.. మీరు చక్రధర్ నీ రిలీజ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ని తయారు చేయమని చెప్పారు కదా అక్షయ్.. అవన్నీ తీసుకొని వచ్చాను మీరు సంతకం చేయాలి అని అక్షయ్ తో లాయర్ అంటాడు.. ఆ మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది. అవని మాత్రం మీరు చెయ్యొద్దు తప్పు చేస్తున్నారు అని అంటుంది. మా నాన్న చెప్పిన మాటనే నేను కాదనలేను అవని మా నాన్నకు మాట ఇచ్చాను అందుకే చక్రధర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను అని అక్షయ్ అంటాడు.. ఇక సంతకం పెట్టేస్తాడు అక్షయ్. అవని అక్షయ్ ఇద్దరు కలిసి కేసు పెట్టారు కాబట్టి మీరు కూడా సంతకం పెట్టాలని లాయర్ అడుగుతాడు.. అయితే తన తల్లిని బయటికి వస్తే చంపేస్తాడు అని భయపడిన అవని సంతకం పెట్టను నా ఇంటి వాళ్ళని మళ్లీ రిస్కులు పడేలేను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Advertisement

పల్లవి అక్షయ్ బావ కేసు పెట్టాడు కదా ఆయన సంతకం పెట్టాడు కదా.. ఇప్పుడు మీరు మా నాన్నని రిలీజ్ చేయచ్చు కదా.. లాయర్ గారు అని అడుగుతుంది.. కేసు పెట్టింది అవని గారు ఆవిడే సంతకం పెట్టాలి లేదంటే మాత్రం ఈ కేసు చెల్లదు అని లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్రప్రసాద్ అవని ఎందుకు సంతకం పెట్టలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లోపలికి వచ్చిన పార్వతి అవని ఎలాంటిదో ఇప్పుడు మీకు అర్థమైందా..? చక్రధర్ అన్నయ్యని విడిపిస్తే ఒక పెద్ద సమస్య పోతుందని మనం అనుకున్నాము.. కానీ అవని మాత్రం ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు మీరు చెప్పిన లెక్క లేకుండా మాట్లాడుతుంది అని పార్వతి అంటుంది..

ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ అవని ఎలాంటిదో నీకు తెలుసు.. మనకు జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసిందో తెలుసు.. కానీ ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు నేను అడిగి తెలుసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇక రాత్రి అవని పల్లవి చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి రాజేంద్రప్రసాద్ వస్తాడు.. అవని నిన్ను ఒక విషయం గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాను అని రాజేంద్ర అంటాడు. సంతకం పెట్టలేదు అని అడగడానికి వచ్చారు మావయ్య గారు అని అవని అంటుంది. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన మీ అత్తయ్యని క్షమించావు. నిన్ను ఎవరిని మాటలు అన్నా సరే మౌనంగా భరించి అందరిని క్షమించావు. నిన్ను అవమానించిన వాళ్ళని కూడా గౌరవించే సంస్కారం నీకు ఉంది అలాంటిది చక్రధర విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని రాజేంద్ర అడుగుతాడు..

Advertisement

చక్రధర్ ను ఎందుకు బయటకు రావద్దని అనుకుంటున్నావో నాకు తెలియడం లేదు అని రాజేంద్ర అడుగుతాడు.. సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను మావయ్య గారు ఇప్పుడు ఈ విషయం గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అవని అంటుంది.. ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు.. నీ మనసులో ఏదో విషయం గురించి మదన పడిపోతున్నావని నాకు అర్థం అవుతుంది. విషయం గురించి మీకు ఇప్పుడు ఏ విషయం చెప్పలేను మామయ్య గారు అని అవని వెళ్ళిపోతూ ఉంటుంది.. నేను నిజం చెప్తే ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయో కూడా తెలియడం లేదు అందుకే నేను అక్షయకి కూడా నిజం చెప్పట్లేదు అని అవని అంటుంది.. నేనున్నాను కదా నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను నాకు చెప్పు.. నువ్వు నా కూతురు కన్నా ఎక్కువ. నాకు చెప్పడానికి నువ్వేమీ మొహమాట పడదు భయపడొద్దు చెప్పమ్మా ఏంటో నేను చేస్తాను అని అంటాడు.. బ్రతిమలాడిన కూడా అవని మాత్రం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది..

ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని అవని ఎంత చెప్తున్నా సరే.. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టు అని అంటాడు.. ఒక పెద్ద మనిషిగా నేను చాలా తగ్గి మాట్లాడాను.. నాకు విలువ ఇవ్వకపోయినా నా ఒట్టుకైనా విలువిచ్చి నిజం చెప్పమ్మా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచి ఉపయోగం లేదు అని అంటుంది. చక్రధరి ఎవరో కాదు మావయ్య గారు నా కన్న తండ్రి అని చెప్పగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు.. ఏమంటున్నావ్ అమ్మ చక్రధర్ మీ నాన్న అని రాజేంద్ర అడుగుతాడు. అవును మావయ్య గారు.. పల్లవి వాళ్ళమని పెళ్లి చేసుకోక ముందు మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు మా అమ్మ మొదటి భార్య. డబ్బు కోసం ఆ దుర్మార్గుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు అలా నేను మా వాళ్ళ నుంచి తప్పిపోయి అనాధగా పెరిగాను.

మా అమ్మ నన్ను కలిసేవరకి చక్రధర్ నా కన్నతండ్రి అన్న విషయం తెలియదు.. మా అమ్మ కూడా నాకు ఆ విషయాన్ని చెప్పలేదు. చక్రధర్ నాకు కన్న తండ్రి అని తెలిస్తే అతను మమ్మల్ని చంపేస్తాడు అన్న భయంతో మా అమ్మ నిజం అని చెప్పలేదు.. తనని ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతోనే అమ్మ కూడా మళ్ళీ ఊరెళ్ళిపోయింది అని అవని అంటుంది. ఇక నాకోసం వెతుకుతూ మా అమ్మ మళ్లీ వచ్చింది. చక్రధర్ నా ఇంట్లో ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్న చక్రధర్ మా అమ్మని చంపే ప్రయత్నం చేశాడు. మా అమ్మని కాపాడుకొని బ్రతికించుకునే ప్రయత్నం చేశాను.

Also Read : మీనాను కాపాడిన బాలు.. రోహిణి గుట్టు రట్టు.. ప్రభావతిని రెచ్చగొట్టిన రోహిణి..

చక్రధర్ చంపేస్తాడు అన్న భయంతోనే మా అమ్మ ఎవరు అడిగినా.. ఎందరో ఎన్నిసార్లుగా అవమానించినా కూడా ఆ దుర్మార్గుడ్ని నేను విడిపించాలని అనుకోవడం లేదు మావయ్య గారు అని అవని అసలు నిజాన్ని రాజేంద్రకి చెప్పేస్తుంది. నేను అతని కూతుర్ని అందరికీ చెప్పేలా చేసినప్పుడే అతని వినిపిస్తాను అని అవని అంటుంది. ఇక రాజేంద్రప్రసాదు వాడు ఒకప్పుడు నా దగ్గర పని చేసేవాడు.. నా చెల్లెలు రాజేశ్వరిని ప్రేమించినట్లు నటించి తనని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు.. వాడు ఒక దుర్మార్గుడు కానీ నేను వాడిని ఎప్పుడూ నేను ఏది అనలేదు. మీ అమ్మ నాకు సొంత చెల్లెలు లాంటిది మీ అమ్మకి అన్యాయం జరగనివ్వను న్యాయం చేసే అంతవరకు నేను వదలను అని రాజేంద్రప్రసాద్ అవనీకి మాట ఇస్తాడు..ఇక పల్లవి ఏం చేస్తుందో తెలుసుకోవాలని పల్లవి నీ ఫాలో అవుతాడు రాజేంద్రప్రసాద్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Big Stories

Advertisement
×