E-Paper
Advertisement

కాలేజ్ అమ్మాయిలను ఘోరంగా వేటాడి చంపే సైకో… ఇది కదా రివేంజ్ అంటే

కాలేజ్ అమ్మాయిలను ఘోరంగా వేటాడి చంపే సైకో… ఇది కదా రివేంజ్ అంటే
Advertisement

Action Horror Movie on OTT : ఓటీటీలో అదిరిపోయే యాక్షన్ మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పై ఓ లుక్ వేయండి. అందమైన అమ్మాయిలు, అదిరిపోయే పార్టీలు, ముసుగు వేసుకున్న ఒక సైకో హంతకుడు.. వీటన్నిటి చుట్టూ తిరిగే రక్తం చిందే కథ ఇది. ఇది ఒళ్లు గగుర్పొడిచే హత్యలతో చాలా భయంకరంగా ఉంటుంది. క్లైమాక్స్ వరకు హంతకుడు ఎవడబ్బా అని మనల్ని బుర్ర గీక్కునేలా చేసే ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకి మంచి మసాలా లాంటిది. దీని పేరు ఏమిటి ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీలోకి వెళ్తే

ఈ అమెరికన్ యాక్షన్ హారర్ సినిమా పేరు ‘సొరోరిటీ రో’ (Sorority Row). ఇది 1982లో వచ్చిన ది హౌస్ ఆన్ సొరోరిటీ రో అనే సినిమాకు రీమేక్. ఈ సినిమాలోని అత్యంత ఆకట్టుకునే విషయం హంతకుడి ఆయుధం. సాధారణంగా వాడే కత్తులు, గొడ్డళ్లకు భిన్నంగా, ఇందులో హంతకుడు ఒక టూల్ కిట్ రాడ్ ను రెండు వైపులా పదునైన బ్లేడ్లతో మార్చి క్రూరంగా వాడుతుంటాడు. ముఖ్యంగా సినిమా చివరలో వచ్చే ట్విస్ట్‌లు, హంతకుడు ఎవరో తెలిసే సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను బాగా థ్రిల్ చేశాయి. ఇందులో ప్రసిద్ధ నటి క్యారీ ఫిషర్ నటించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఆమె ఒక గన్ పట్టుకుని హాస్టల్ అమ్మాయిలను కాపాడటానికి చేసే ఫైట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. విమర్శకులు నెగటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ, గ్లామర్ భయం కలగలిసిన స్లాషర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఇప్పటికీ ఒక ‘గిల్టీ ప్లెజర్’ మూవీగా నిలిచిపోయింది. దీన్ని Google Play Movies, YouTube Movies, Apple TVలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక హాస్టల్‌లో ఐదుగురు అమ్మాయిలు కలిసి, తమ ఫ్రెండ్‌ని ఏడిపించడానికి ఒక పిచ్చి ప్లాన్ వేస్తారు. ఆ ఆట కాస్తా బెడిసికొట్టి, అనుకోకుండా ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ గొడవ ఎక్కడ తమ మీదకు వస్తుందో అని భయపడిపోయి, పోలీసులకు చెప్పకుండా ఆ శవాన్ని ఒక పాత బావిలో పడేసి చేతులు దులుపుకుంటారు వీళ్ళు. ఈ విషయం మన ఐదుగురి మధ్యే ఉండాలి, ఎవరికీ తెలియకూడదని ఒట్లు పెట్టేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే.. ఒక ఎనిమిది నెలల తర్వాత వీళ్లందరూ చదువు పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ పార్టీ చేసుకుంటున్న టైమ్‌లో సీన్ రివర్స్ అవుతుంది.

ఆ రోజు వీళ్లు చేసిన పాపం ఊరికే పోకుండా, ఒక ముసుగు వేసుకున్న హంతకుడు వీళ్ల వెంట పడతాడు. ఒక పెద్ద రాడ్ పట్టుకుని, వీళ్లను ఒక్కొక్కరిని దారుణంగా వేటాడటం మొదలుపెడతాడు. వాడు చంపే పద్ధతి చూస్తుంటే వీళ్లు చేసిన పాత గొడవ వాడికి ముందే తెలుసని అర్థమవుతుంది. చివరికి ఆ ముసుగు వెనుక ఉన్నది ఎవరో తెలిసి అందరూ షాక్ అవుతారు. ఆ గ్యాంగ్‌లోని అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతుంటే, మిగిలిన వాళ్ళు ఆ సైకో నుండి ఎలా తప్పించుకున్నారు? అసలు ఆ హంతకుడు చనిపోయిన అమ్మాయి తాలూకు వాడా ? లేక మరెవరైనా ఉన్నారా? అనేదే ఈ క్లైమాక్స్.

Advertisement

Read Also ; 19 సీజన్లతో దుమ్ములేపుతున్న క్రైమ్ థ్రిల్లర్… ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త మలుపు… ఐయండిబి లో 8.2 రేటింగ్

Tags

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×