E-Paper
Advertisement

అక్క కోసం విలన్‌తో పోరాడే తమ్ముడు… ఓటీటీలోకి వ‌చ్చేసిన నాగ‌శౌర్య సినిమా

అక్క కోసం విలన్‌తో పోరాడే తమ్ముడు… ఓటీటీలోకి వ‌చ్చేసిన నాగ‌శౌర్య సినిమా
Advertisement

Action Movie on OTT : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాల సందడి ఓటీటీలో ఎక్కువగానే ఉంటుంది. హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. కంటెంట్ నచ్చితే ప్లాఫ్ సినిమాలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన నాగశౌర్య తెలుగు మూవీ సెలైంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చినా కూడా ఇది బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక పోయింది. అసలు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో అడుగుపెట్టిందో కూడా చాలా మందికి తెలీదు కూడా. మరి ఇప్పుడు ఓటీటీలో దీనికి ఏమాత్రం ఆదరణ వస్తుందో చూడాలి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

నాగశౌర్య హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘Bad Boy కార్తీక్’. ఈ ఏడాది 2026 ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా అయితే సక్సెస్ కాలేదు. ఇది మే 15 నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి ఐఎండీబీలో 7.2 రేటింగ్ అయితే ఉంది. నాగశౌర్య, విధి యాదవ్, సముద్రఖని, శ్రీదేవి విజయ్ కుమార్ నటించిన ఈ సినిమాను, కొత్త దర్శకుడు రమేష్ దేశిన తెరకెక్కించారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.

ప్రమోషన్లు లేక పోవడం మైనస్‌

Advertisement

బాక్సాఫీస్ వద్ద ఇది బోల్తా కొట్టడానికి కారణం ప్రమోషన్లు నామమాత్రంగా చేయడమే. ఎందుకంటే సినిమా మేకింగ్ స్టైల్ ఆకట్టుకునేలానే ఉంది. దీనికి ఏ మాత్రం పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా థియేటర్లలో ఆడలేదు. ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమవడంతో చాలా మంది సినీ ప్రియులకు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది. థియేటర్లకు వెళ్లని సినీ అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను ఎంచక్కా చూసేయచ్చు.

స్టోరీ ఏమిటంటే

వైజాగ్‌లో ఏ బాధ్యత లేకుండా జల్సాగా తిరిగే కార్తీక్ (నాగశౌర్య) అనే కుర్రాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతనికి తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే పంచప్రాణాలు. ఆమె ఊరిలో ఒక పెద్ద లాయర్. కార్తీక్ ఎక్కడా స్థిరపడకుండా అల్లరిగా తిరుగుతుండటంతో, అతన్ని బాగుచేయడానికి ఎలాగైనా విదేశాలకు పంపించాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తుంటుంది. అయితే అక్కను వదిలి వెళ్లడం ఇష్టం లేని కార్తీక్, ప్రతిసారీ వీసా ఇంటర్వ్యూలను కావాలనే జాప్యం చేస్తూ ఇండియాలోనే ఉండిపోతాడు.

Advertisement

ఇలాంటి సమయంలో, స్థానిక రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ వాళ్ళను వేధించే గోవిందప్ప అనే క్రూరమైన గూండాతో లాయర్ కస్తూరి గొడవ పడుతుంది. ఈ గొడవ పెద్దదై గోవిందప్ప మనుషులు కస్తూరిపై దాడికి దిగి, ఆమె ప్రాణాలకే ముప్పు తెస్తారు. అప్పటివరకు అల్లరి కుర్రాడిగా ఉన్న కార్తీక్, తన అక్కను కాపాడుకోవడానికి ఒక్కసారిగా రౌద్ర రూపాన్ని ఎత్తుతాడు. చివరికి ఆ గూండాలను కార్తీక్ ఎలా మట్టికరిపించాడు ? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే మిగతా యాక్షన్ స్టోరీ.

Read Also : సైనికుడి మాయలో నియంత… కేట్ విన్స్లెట్ కెరీర్ లోనే విభిన్నమైన పొలిటికల్ సెటైర్ వెబ్ సిరీస్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×