E-Paper
Advertisement

సైనికుడి మాయలో నియంత… కేట్ విన్స్లెట్ కెరీర్ లోనే విభిన్నమైన పొలిటికల్ సెటైర్ వెబ్ సిరీస్

సైనికుడి మాయలో నియంత… కేట్ విన్స్లెట్ కెరీర్ లోనే విభిన్నమైన పొలిటికల్ సెటైర్ వెబ్ సిరీస్
Advertisement

Political Satire Series on OTT : రాజకీయాల్లో ఉండే కుతంత్రాలను నవ్వుకుంటూనే చురకలు వేస్తోంది ఒక సిరీస్. ఈ పొలిటికల్ డార్క్ కామెడీ సిరీస్ లో టైటానికి సుందరి కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఇందులో ఒక దేశాన్ని ఏలే పాలకురాలికి నటించింది. ఆమె చుట్టూ ఉన్న ఆఫీసర్లు తమ స్వార్థం కోసం ఆమెను ఎలా బురిడీ కొట్టిస్తారు, దానివల్ల ఆ దేశం ఎలా నాశనమైపోతుందనే మ్యాటర్‌ను కాస్త వెటకారంగా, నవ్వు తెప్పించేలా ఈ సిరీస్‌లో చూపించారు. ఇందులో పెద్దగా ఫైట్లు, రొటీన్ మసాలాలు ఏమీ ఉండవు. అయితే అధికారం చేతిలో ఉన్నవాళ్ల అహంకారం ఎంత దారుణంగా ఉంటుందో వ్యంగ్యంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ డ్రామా.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ పొలిటికల్ సెటైరికల్ సిరీస్ పేరు ‘ది రెజీమ్’ (The Regime). దీనిని విల్ ట్రేసీ సృష్టించగా, ఆస్కార్ నామినేటెడ్ దర్శకుడు స్టీఫెన్ ఫ్రియర్స్, జెస్సికా హాబ్స్ కలసి తెరకెక్కించారు. ఈ కథలో చూపించే నియంత ప్యాలెస్ చారిత్రాత్మక వైభవంతో కనిపించడం కోసం, ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని కొన్ని సీన్స్ ఘాట్ చేశారు. ఆస్కార్ అవార్డు విజేత అలెగ్జాండర్ డెస్ప్లాట్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్‌లోని డార్క్ కామెడీని మరింత రక్తికట్టించింది. ఇక ఛాన్సలర్ ఎలెనా వెర్న్‌హామ్‌గా నటించిన కేట్ విన్స్లెట్, ఈ వింతైన నియంత పాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బాడీ లాంగ్వేజ్‌ను ఉపయోగించి విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటనకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కింది. ఈ మినీ సిరీస్ 2024 మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయింది. ఆ తర్వాత ప్రతి వారం ఒక ఎపిసోడ్ చొప్పున విడుదలై, ఏప్రిల్ 7, 2024 న ఆరవ ఎపిసోడ్‌తో ముగిసింది. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio hotstar)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఎలెనా వెర్న్‌హామ్ (కేట్ విన్స్లెట్) అనే మహిళ ఒక యూరోపియన్ దేశానికి ఛాన్సలర్ గా ఉంటుంది. అయితే ఆమెకు ఆరోగ్య విషయాల్లో విపరీతమైన భయాలు, అనుమానాలు ఎక్కువ. ముఖ్యంగా ఆమె ఉండే ప్యాలెస్‌లో విషపూరితమైన బూజు ఉందనే భయంతో చాలా కాలం పాటు బయటి ప్రపంచంలోకి రాకుండా ప్యాలెస్‌కే పరిమితమవుతుంది. ఈ క్రమంలో గాలిలో తేమను పరీక్షించడానికి హెర్బర్ట్ జుబాక్ అనే ఒక సైనికుడిని తన పక్కన పెట్టుకుంటుంది. ఆ సైనికుడు మెల్లమెల్లగా ఆమెను పూర్తిగా ప్రభావితం చేసి, దేశ పాలనలో జోక్యం చేసుకోవడం మొదలుపెడతాడు. వీళ్లిద్దరి అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, చివరికి ప్రజలు, తిరుగుబాటుదారులు ప్యాలెస్‌పై దాడి చేసే పరిస్థితి వస్తుంది.

ఇక ముగింపు విషయానికొస్తే, తిరుగుబాటు తీవ్రరూపం దాల్చడంతో ఎలెనా, జుబాక్ ప్యాలెస్ వదిలి పారిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో అమెరికన్ పొలిటికల్ లీడర్స్ ఆమెకు ఒక ప్రతిపాదన చేస్తారు. జుబాక్‌ను వదిలేసి, మేము చెప్పినట్టు వినే రబ్బర్ స్టాంప్ పాలకురాలిగా మారాలని కండిషన్ పెడతారు. వేరే దారి లేక, పదవి కాపాడుకోవడం కోసం ఎలెనా తన ప్రియుడైన జుబాక్‌ను చంపించడానికి ఒప్పుకుంటుంది. చివరికి జుబాక్ దారుణంగా చంపబడతాడు. ఎలెనా మాత్రం ఏ తప్పు ఎరుగనట్టు మళ్లీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బాక్స్‌లో నిలబడి ప్రజల ముందు ఫోజులు కొడుతూ, చనిపోయిన జుబాక్ శవాన్ని తన ప్యాలెస్ బేస్‌మెంట్‌లో ఒక అద్దాల పెట్టెలో దాచుకుని మళ్లీ తన పాత సింహాసనంపై కూర్చుంటుంది.

Advertisement

Read Also : నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×